సినిమా కంటెంట్ తగ్గట్టుగానే హీరో తాగుబోతుగా కనిపించిన తీరు అందరినీ కట్టిపడిస్తోంది. ధర్మ తన లుక్స్ అండ్ ఫిజిక్ పరంగా తన పాత్ర మేరకు బాగా మెయింటైన్ చేశాడు. అలాగే తన రియలిస్టిక్ యాక్టింగ్‌తో ఆకట్టుకున్నాడు. లవ్, ఎమోషన్స్, డాన్స్, ఫైట్స్ ఇలా అన్ని విభాగాల్లో ధర్మ తనదైన శైలిలో ఆకట్టుకున్నారు.
హీరో ధర్మ డెబ్యూ సినిమా అయినప్పటికీ 10 సినిమాలు చేసిన అనుభవం ఉన్న నటుడిలా తెరపై అద్భుత ప్రదర్శనను కనబరిచారు. యాక్టింగ్, డాన్సింగ్, ఫైట్స్, ఎమోషనల్ సీన్స్ అలాగే కామెడీని కూడా ఇరగదీసాడు. ఇక క్లైమాక్స్‌లో ప్రేక్షకుల చేత కంటతడి పెట్టించాడు. ఈ సినిమాలో ధర్మ పెర్ఫామెన్స్ చూసిన తర్వాత కచ్చితంగా టాలీవుడ్‌లో మరిన్ని అద్భుతమైన చిత్రాలు చేస్తారని ప్రేక్షకులు ఆకాంక్షిస్తున్నారు.