తన సినీ కెరీర్ ప్రారంభం నుంచి విభిన్నమైన కథలను నమ్ముకుంటూ ముందుకెళ్తున్నాడు. 'స్వామిరారా', 'కార్తికేయ', 'ఎక్కడిపోతావు చిన్నవాడా', 'కిరాక్ పార్టీ' సినిమాలతో నిఖిల్ హిట్లు అందుకున్నారు. తాజాగా ఆయన 'కార్తికేయ-2'లో నటిస్తున్నాడు.
వివరాల్లోకి వెళితే డాక్టర్ పల్లవి వర్మని ప్రేమించిన నిఖిల్ అందరి సమ్మతితో ప్రేమ వివాహం చేసుకోబోతున్నాడు. గోవాలో శనివారం (ఫిబ్రవరి 1న) పెద్దల సమక్షంలో నిశ్చితార్థం జరుపుకున్నాడు. ఏప్రిల్ 16వ తేదీన పల్లవి వర్మను వివాహం చేసుకోబోతున్నాడు. డాక్టర్ పల్లవికి నిఖిల్ ప్రపోజ్ చేస్తున్న ఫొటోలు వైరల్ అవుతున్నాయి.