ఏపీ సర్కారు ప్రకటించిన నంది అవార్డులపై పలు విమర్శలొస్తున్న సంగతి తెలిసిందే. నంది అవార్డులపై తాజాగా సినీ హీరో శివాజీ స్పందించారు. తాజాగా ప్రకటించిన నంది పురస్కారాల్లో మెగా ఫ్యామిలీకి అన్యాయం జరిగిన మాట వాస్తవమేనని తెలిపారు. టీడీపీకి చెందిన వారికే అవార్డులు ఇవ్వడం న్యాయం కాదని మండిపడ్డారు. తనకు ఇలాగే గతంలో అన్యాయం జరిగిందన్నారు.
గతంలో తాను నటించిన మిస్సమ్మ సినిమా బాగా ఆడిందని, అందరి ప్రశంసలు అందుకుందని కానీ అవార్డు రాలేదన్నారు. మిస్సమ్మ సినిమాకు తనకు ఉత్తమ నటుడిగా అవార్డు ఇవ్వాలని 90 శాతం మంది కమిటీ సభ్యులు ఎంపిక చేస్తే కొందరు అడ్డుకున్నారని, తనకు ఈ విషయంపై ప్రశ్నించే అవకాశం కూడా ఇవ్వలేదని గుర్తు చేశారు.