Ashwin Babu, Digangana , Apsar
కథానాయకుడు అశ్విన్ బాబు కొత్త సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. గంగ ఎంటర్‌టైన్ మెంట్స్ పతాకంపై ప్రొడక్షన్ నంబర్ 1గా మహేశ్వర్ రెడ్డి మూలి నిర్మిస్తున్న చిత్రమిది. అప్సర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ప్రారంభోత్సవంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న ప్రముఖ నిర్మాతలు సుధాకర్ రెడ్డి, 'ఠాగూర్' మధు, శిరీష్ రెడ్డి, ఎర్రబెల్లి విజయ్ కుమార్ రావు జ్యోతి ప్రజ్వలన చేశారు.