రిషి, శిల్ప నాయక్, తేజు అనుపోజు, శివ కార్తీక్ ప్రధాన పాత్రల్లో సునీల్ కుమార్ రెడ్డి దర్శకత్వంలో భరద్వాజ్ సినీ క్రియేషన్స్ పతాకంపై వివి వామన రావు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. నిర్మాతగానే కాకుండా కథా స్క్రీన్ ప్లే అందించి ఓ కీలక పాత్రలో నటించడం విశేషం. ఈ చిత్రం ఈ నెల 17న రెండు తెలుగు రాష్ట్రాల్లో విడుదలవుతుంది.
ఈ సందర్భంగా నటుడు, రచయిత, నిర్మాత వి వి వామన రావు మాట్లాడుతూ "1979 నుంచి రచయితగా చాలా నాటకాలు రాసాను. నా కథ కి నంది అవార్డు కూడా వచ్చింది. తర్వాత సీరియల్స్ రాసాను, నిర్మించాను. కథలు చాలా రాసాను, 8 ఏళ్ళ క్రితం ఒక పాకిస్తాన్ అమ్మాయి భారతదేశం నేవీ ఆఫీసర్ ని ట్రాప్ చేసి మన దేశం రహస్య సమాచారాన్ని దోచుకుంది. అప్పుడు పుట్టిన కథ ఇది. తర్వాత ఈ మధ్య కాలంలో ఈ హనీ ట్రాప్ లాంటి చాలా వార్తలు పత్రికల్లో చదివాను. ఇది మంచి సమయం అని ఈ కథ ని సినిమా గా చిత్రరించాము.
సునీల్ కుమార్ రెడ్డి గారు గతం లో రొమాంటిక్ క్రిమినల్స్ లాంటి సినిమాలు నిర్మించి కమర్షియల్ సక్సెస్ సాధించారు. అయితే నా కథ కి సునీల్ కుమార్ రెడ్డి బాగా సరిపోతారు అని తనతో ప్రయాణం మొదలు పెట్టాను. నేను ఊహించుకున్న కథ కన్నా సునీల్ కుమార్ రెడ్డి అద్భుతంగా దర్శకత్వం వహించారు. సినిమా చాలా బాగా వచ్చింది. నా తర్వాత సినిమా కూడా సునీల్ గారితోనే.