నితిన్, నిత్య మీనన్ జంటగా నటించిన సినిమా ఇష్క్. 2012, ఫిబ్రవరి 24న విడుదలై అద్భుతమైన విజయాన్ని చవిచూసింది. శ్రేష్ట్ మూవీస్ పతాకంపై విక్రమ్ గౌడ్, సుధాకర్ రెడ్డి నిర్మాణ సారథ్యంలో విక్రం కె. కుమార్ దర్శకత్వం వహించారు. అనూప్ రూబెన్స్, అరవింద్ శంకర్ సంగీతం అందించారు. నేటికి అంటే ఫిబ్రవరి 24కు విడుదలై పదేళ్ళు పూర్తిచేసుకుంది. ఈ సందర్భంగా చిత్రంలో నటించిన నితిన్, నిత్య మీనన్, విక్రం కె. కుమార్, పి.సి. శ్రీరామ్, అనూప్ రూబెన్స్ తమ ఆనందాన్ని ఇలా ఆవిష్కరించారు.