నిఖిల్ దేవాదుల హీరోగా నటిస్తున్న సినిమా "ఘటికాచలం". ఈ చిత్రానికి కథను అందిస్తూ ఒయాసిస్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు ప్రొడ్యూసర్ ఎం.సి.రాజు. "ఘటికాచలం" చిత్రాన్ని ఇంటెన్స్ సస్పెన్స్ థ్రిల్లర్ గా రూపొందిస్తున్నారు దర్శకుడు అమర్ కామెపల్లి. ఈ సినిమాను మాస్ మూవీ మేకర్స్ పై ప్రముఖ దర్శకుడు మారుతి, సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ ఎస్ కేఎన్ రిలీజ్ చేస్తున్నారు. ఈ నెల 31 "ఘటికాచలం" సినిమా థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ రోజు ఈ సినిమా ట్రైలర్ ను హైదరాబాద్ లో లాంఛ్ చేశారు.
ప్రొడ్యూసర్ ఎస్ కేఎన్ మాట్లాడుతూ - "ఘటికాచలం" సినిమాను మారుతి గారు చూసి బాగుందని చెబితే నేనూ చూశాను. నాకు బాగా నచ్చింది. ఈ సినిమాకు ప్రొడ్యూసర్ రాజు గారు మంచి స్టోరీ ఇచ్చారు. అలాగే ఇటాలియన్ మ్యూజిక్ డైరెక్టర్ ఫ్లేవియో మ్యూజిక్ సినిమాలో మనల్ని లీనమయ్యేలా చేస్తుంది. సినిమా మొదలైన పది నిమిషాల్లోనే ఆ కథలోకి వెళ్లిపోతాం. మన కళ్ల ముందే యదార్థ ఘటనలు జరుగుతున్నట్లు ఫీల్ అవుతాం. అలా ఎంగేజ్ చేస్తూనే చివరలో మంచి మెసేజ్ ఇచ్చారు. ఇంటెన్స్ సీన్స్ మిమ్మల్ని ఆకట్టుకుంటాయి. కొత్త వాళ్లు తమ టాలెంట్ చూపించాలంటే బెస్ట్ ఆప్షన్ హారర్ జానర్. ఎవరైనా తమ స్టోరీని హారర్ జానర్ లో ఎఫెక్టివ్ గా చెప్పవచ్చు. ఈ నెల 31న "ఘటికాచలం" సినిమా థియేటర్స్ లోకి వస్తోంది. హారర్ మూవీస్ ను ఇష్టపడే ప్రేక్షకులు థియేటర్ లోనే "ఘటికాచలం" సినిమాను చూడండి.
అప్పుడే హారర్ ఎఫెక్ట్ లు, బీజీఎంకు బాగా కనెక్ట్ అవుతారు. టికెట్ రేట్స్, పాప్ కార్న్ ధరలు..ఇలా కొన్నింటి వల్ల థియేటర్స్ కు ఆడియెన్స్ దూరమవుతున్నారు. థియేటర్స్ కు ఎక్కువమంది ఆడియెన్స్ ను తీసుకొచ్చేలా మన ఇండస్ట్రీ పెద్దలు ఆలోచనలు చేయాలి. అలా జరిగితే మిగతా అన్ని సమస్యలూ పరిష్కారమవుతాయి. ఐసీయూలోకి వచ్చిన పేషెంట్ కు ముందు పెడీక్యూర్, ఫేషియల్ చేయాలని అనుకోకూడదు, లైఫ్ కాపాడే ప్రయత్నం చేయాలి. ముందు మన సినిమాను థియేట్రికల్ గా కాపాడుకోవాలి. మరో రెండు వారాల్లోపే రాజా సాబ్ సినిమా నుంచి అప్డేట్ రాబోతోంది. అన్నారు.
హీరో నిఖిల్ దేవాదుల మాట్లాడుతూ - నేను చైల్డ్ ఆర్టిస్టుగా 70 సినిమాల వరకు చేశాను. ఇది హీరోగా నా మొదటి మూవీ. చాలా ఎఫర్ట్స్ పెట్టి "ఘటికాచలం" సినిమాకు వర్క్ చేశాం. టెక్నికల్ గా, స్క్రిప్ట్ పరంగా ప్రతి విషయంలో జాగ్రత్తలు తీసుకున్నాం. ఈ క్యారెక్టర్ నాకు ఛాలెంజింగ్ గా అనిపించింది. తను ఒక్కో మూడ్ ను బట్టి ఒక్కోలా బిహేవ్ చేస్తుంటాడు. షాట్ పర్పెక్ట్ గా వచ్చేవరకు మా డైరెక్టర్ గారు కాంప్రమైజ్ కాలేదు. ఈ క్యారెక్టర్ లో పర్ ఫార్మెన్స్ చూసుకున్నాక సంతృప్తిగా అనిపించింది. మా మూవీ టీజర్ ను లైక్ చేశారు. ఇప్పుడు ట్రైలర్ కూడా మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాం. "ఘటికాచలం" చిత్రాన్ని రిలీజ్ చేస్తున్న ఎస్ కేఎన్ గారికి, మారుతి గారికి థ్యాంక్స్. నాతో పాటు వర్క్ చేసిన కో ఆర్టిస్టులు అందరికీ థ్యాంక్స్. నా, ఫ్రెండ్స్, మా పేరెంట్స్ ఇక్కడే ఉన్నారు. నేనేం చేసినా వాళ్ల కోసమే. "ఘటికాచలం" సినిమాను ఈ నెల 31న థియేటర్స్ లో చూసి సపోర్ట్ చేయాలని కోరుతున్నా. అన్నారు.
నటుడు జోగి నాయుడు మాట్లాడుతూ - "ఘటికాచలం" మంచి కంటెంట్ ఉన్న సినిమా. కంటెంట్ బాగున్న చిత్రాలను తెలుగు ఆడియెన్స్ తప్పకుండా ఆదరిస్తారు. ఈ చిత్రంలో నేనొక చిన్న రోల్ చేశాను. పాత్ర చిన్నదైనా నాకు మంచి గుర్తింపు దక్కుతుందని ఆశిస్తున్నా. ఈ నెల 31న థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న "ఘటికాచలం" చిత్రాన్ని మీరంతా సక్సెస్ చేయాలని కోరుకుంటున్నా. అన్నారు.
రైటర్ శ్రీనివాస్ మల్కార్ మాట్లాడుతూ - డైరెక్టర్ అమర్ నేను కలిసి చాలా కథలు డిస్కస్ చేసేవాళ్లం. ఒకరోజు అమర్ మనం హారర్ మూవీ చేయబోతున్నాం అన్నారు. మన దగ్గర ఆ కథ లేదు కదా అంటే, తన యూఎస్ ఫ్రెండ్, ప్రొడ్యూసర్ దగ్గర ఒక స్టోరీ ఉంది. దాన్ని మనం డెవలప్ చేస్తే చాలా బాగుంటుంది అన్నారు. అలా "ఘటికాచలం" సినిమా జర్నీ మొదలైంది. ఈ సినిమా మిమ్మల్ని ఆకట్టుకునేలా ఉంటుంది. మా మూవీని ఇంత బాగా రిలీజ్ కు తీసుకొస్తున్న ఎస్ కేఎన్ గారికి, మారుతి గారికి థ్యాంక్స్. అన్నారు.
డైరెక్టర్ అమర్ కామేపల్లి మాట్లాడుతూ - హారర్ మూవీస్ ఇష్టం లేదనే వారు సరైన హారర్ మూవీ చూడలేదని అనుకుంటాను. "ఘటికాచలం" సినిమా టెక్నికల్ గా హై క్వాలిటీతో ఉంటుంది. ప్రొడ్యూసర్ రాజు గారు ఇచ్చిన కథలో మంచి నావెల్టీ ఉంది. ఆ నావెల్టీనే టెక్నికల్ గా హై క్వాలిటీతో మూవీ చేసేందుకు స్ఫూర్తినిచ్చింది. డీవోపీ మనోజ్, ఇటాలియన్ మ్యూజిక్ డైరెక్టర్ ఫ్లేవియో..ఇలా మా టెక్నీషియన్స్ అందరూ సినిమాను ఎంతో క్రియేటివ్ గా తీర్చిదిద్దారు. ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్స్ కు మా చిత్రాన్ని పంపించాలని ప్రయత్నించాం. అయితే ముందు మన ఆడియెన్స్ కు రీచ్ చేస్తే బాగుంటుంది అనిపించింది.
ఇందులో హారర్, సస్పెన్స్ థ్రిల్లర్ అంశాలుంటాయి. తండ్రీ కొడుకుల మధ్య ఉండే ఎమోషన్ ఆకట్టుకుంటుంది. ఇటీవల ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకున్న అడలసెన్స్ అనే మూవీలోని కొన్ని సీన్స్ చూశాక అలాంటి సీన్స్ మా చిత్రంలోనూ ఉన్నాయి కదా అనిపించింది. యువత మానసిక పరిస్థితులు ఎక్కడైనా ఒక్కటే. "ఘటికాచలం" సినిమాను ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారని నమ్ముతున్నాం. అన్నారు.