తాజాగా ఈ అమ్మడు తన ట్విట్టర్‌లో వెరైటీ వంటకాలకు సంబంధించిన ఫోటో ఒకటి షేర్ చేసి నెటిజన్లకి నోరూరించేలా చేసింది. వివరాలలోకి వెళితే రజనీకాంత్ 'కాలా' సెట్‌లో నోరూరించే రుచికరమైన వంటకాలు చేయించారట. ఇవి ప్రత్యేకంగా హుమా ఖురేషి కోసమే చేయించినట్టు తెలుస్తుంది. మరి ఈ ఆనందాన్ని తన అభిమానులతోను పంచుకునేందుకు హుమా పలు రకాల వంటకాలని ఒక చోట చేర్చి, వాటిని ఫోటో తీసి ‘బెస్ట్ టీమ్ ‘కాలా’... మా కోసం చేయించిన వంటకాలు అద్భుతం.. సూపర్ స్టార్ రజనీ సార్ ధన్యవాదాలు’ అనే కామెంట్ పెట్టింది.
కాగా, ముంబై మాఫియా నేపథ్యంలో 'కాలా కారికాలన్' చిత్రం తెరకెక్కుతుండగా, ఈ చిత్రంలో రజనీకాంత్ దారవీ ప్రాంతంలోని తమిళుల కోసం పోరాడే కరికాలన్ పాత్రలో కనిపించనున్నాడు. 70 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం వచ్చే ఏడాది థియేటర్లలోకి రానుంది. ప్రస్తుతం చెన్నైలో మూవీ షూటింగ్ జరుగుతుండగా, ఇందులో సూపర్ స్టార్ రజనీకాంత్ రీల్ భార్యగా ఈశ్వరీ రావు కనిపించనుంది.