దిగ్విజయ్ సింగ్ సంచల నిర్ణయం... కొంతకాలం దూరంగా...

ఆదివారం, 1 అక్టోబరు 2017 (11:29 IST)
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మధ్యప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. పదునైన వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలిచే ఈయన తీసుకున్న నిర్ణయం పట్ల పలువురు రాజకీయ నేతలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. 
 
ఈయన తీసుకున్న నిర్ణయం ఏంటో తెలుసా? ఆర్నెల్ల పాటు సోషల్ మీడియా వేదిక ట్విటర్‌కు గుడ్‌బై చెప్పనున్నట్టు తెలిపారు. తాను ఈ కాలంలో ఎలాంటి పోస్టులూ పెట్టననీ.. కేవలం సమాధానాలు మాత్రమే ఇస్తానని స్పష్టం చేశారు. నర్మదా యాత్ర పేరిట దిగ్విజయ్ సింగ్ మధ్య ప్రదేశ్‌లో మొత్తం 3,300 కిలోమీటర్ల మేర సుదీర్ఘ పర్యటనకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. 
 
శనివారం ద్వారాకా పీఠాధిపతి శంకరాచార్య స్వరూపానందేంద్ర సరస్వతి ఆశీర్వాదం తీసుకుని ఆయన పాదయాత్రను ప్రారంభించారు. ఈ యాత్ర కొనసాగే ఆరు నెలల కాలంలో తాను రాజకీయాలు మాట్లాడబోనని డిగ్గీ వ్యాఖ్యానించడం గమనార్హం. నదులు, సాగునీటి ప్రాజెక్టులన్నీ చుట్టి వచ్చి వాటిలో జరుగుతున్న అవినీతిని ప్రజలకు తెలియజెప్పాలని నిర్ణయించుకున్నట్టు వెల్లడించారు. 
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు