విశాల్, ప్రియా భవానీ శంకర్ హీరో హీరోయిన్లుగా జీ స్టూడియోస్, స్టోన్ బెంచ్ ఫిల్మ్స్ సంయుక్తంగా రత్నం చిత్రాన్ని నిర్మించారు. కార్తికేయన్ సంతానం నిర్మాతగా వ్యవహరించారు. యాక్షన్ డైరెక్టర్ హరి ఈ మూవీకి దర్శకత్వం వహించారు. ఈ మూవీని శ్రీ సిరి సాయి సినిమాస్ బ్యానర్ మీద తెలుగులో సీహెచ్ సతీష్ కుమార్, కే రాజ్ కుమార్ సంయుక్తంగా రిలీజ్ చేస్తున్నారు. ఏప్రిల్ 26న రాబోతోన్న ఈ మూవీ ప్రమోషన్స్‌లో విశాల్ పాల్గొన్నారు.