మహిళకుండే సమస్యలు నాకూ వున్నాయి. నేను పిసిఒఎస్‌తో బాధపడుతున్నా, ఆందోళనా ఉంది. కాబట్టి సెరోటోనిన్, హ్యాపీ ఎండార్ఫిన్‌లను విడుదల చేయడానికి అలాగే నేను అనుభవిస్తున్న శారీరక నొప్పిని ఎదుర్కోవటానికి పని చేయడం చాలా ముఖ్యం. నా కాళ్ళు, నా చేతులు పేలగా వుండేవి. వాటిని బలోపేతం చేయడానికి నేను కృషి చేశా. నా ఆందోళన కోసం, నేను మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నా. ఇది నాకు నిజంగా సహాయపడింది. మనం మన శరీరాన్ని ప్రేమతో చూడాలి. అది వేరే రకమైన శక్తిని మనకు ప్రసరిస్తుంది. నేను ఫిట్‌నెస్‌ను నా దైనందిన జీవితంలో ఒక భాగంగా భావించే చర్యగా భావిస్తాను. ఇప్పుడు నేను దాన్ని ఆస్వాదించాను` అని శుత్రిహాసన్ పేర్కొంది.