కాగా, తాజా సమాచారం ప్రకారం బాలకృష్ణతో జోడీ కట్టడానికి శ్రుతిహాసన్‌ను పరిశీలనలో వున్నట్లు చిత్ర యూనిట్ తెలియజేస్తుంది మైత్రీమూవీస్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది. సినిమాను లాంఛనంగా అరంభించారు కూడా. డాన్ శీను, బలుపు, పండగ చేస్కో వంటి సినిమాలతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న గోపీచంద్ బాలకృష్ణ ఇమేజ్ కు సరిపోయేలా ఓ చరిత్రకారుని కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కించబోతున్నారని తెలుస్తోంది.
పల్నాటి ప్రాంతానికి చెందిన ఆ చరిత్రకారుని కథకి బాలయ్య తగిన న్యాయం చేస్తాడని అంటున్నారు. ఈ సినిమాలో ఫ్లాష్‌బేక్ ఎపిసోడ్ కీలకమైంది. అందుకు శ్రుతిహాసన్ సరిపోతుందని అందుకే ఆమెను సంప్రదించినట్లు తెలుస్తోంది. కరోనా కరుణిస్తే జులై నుంచి ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్ళనుంది. వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలన్నది దర్శకనిర్మాతల ప్లాన్.