బిగ్ బాస్4 విజేతగా నిలిచిన తర్వాత ఏదైనా మంచిపని చేయాలనుకున్నా. అందుకే అందరికీ ప్రాణవాయువు ఇచ్చే మొక్కలను నాటాలని ముందుకు వచ్చా. ఈరోజు అందుకు శ్రీకారం చుట్టాను.. అని సీజన్4 విజేత అభిజిత్ తెలియజేస్తున్నారు. ఇంకా పలు మంచి పనులు చేయడానికి సిద్ధంగా వున్నాననీ, సినిమా రంగంలో కూడా ఎదగాలనుకుంటున్నానని తెలిపారు.
ఇంత మంచి కార్యక్రమం చేపట్టి ముందుకు తీసుకుపోతున్న సంతోష్ గారికి కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది. పెరిగిపోతున్న వాతావరణ కాలుష్యాన్ని మనందరం నియంత్రించాలని, అందుకోసం ప్రతి ఒక్కరి బాధ్యతగా మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా తనతోపాటు బిగ్ బాస్ షోలో పాల్గొన్న సోహెల్, హారిక, కళ్యాణిలను గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో MLC శ్రీనివాస్ రెడ్డి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ రాఘవ, కిషోర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.