ఆ మూడు లక్షణాలు నేర్చుకున్నాను - వారిని గౌరవంగా భావిస్తున్నా - తాన్యా రవిచంద్రన్

శుక్రవారం, 5 నవంబరు 2021 (16:06 IST)
Tanya Ravichandran
న‌ట వార‌సురాలిగా 'రాజా విక్రమార్క` తో వెండితెర‌పై క‌న్పించ‌నున్న న‌టి తాన్యా రవిచంద్రన్. మలేషియా తమిళ నటుడు రవిచంద్రన్ మనవరాలు. తెలుగులో కార్తికేయకు జంటగా నటించారు. ప్రముఖ దర్శకుడు వి.వి. వినాయక్ శిష్యుడు శ్రీ సరిపల్లి దర్శకుడిగా పరిచయం చేస్తూ. శ్రీ చిత్ర మూవీ మేకర్స్ పతాకంపై ఆదిరెడ్డి .టి సమర్పణలో '88' రామారెడ్డి నిర్మించిన సినిమా 'రాజా విక్రమార్క'. స్పై యాక్షన్ ఎంటర్టైనర్ ఇది. ఇందులో ఎన్.ఐ.ఏ ఏజెంట్ పాత్రలో కార్తికేయ నటించారు. నవంబర్ 12న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా తాన్యా రవిచంద్రన్ ఇంట‌ర్వ్యూ విశేషాలు.
 
సినీ నేపథ్యమున్న వున్న మీకు సినిమాల్లోకి రావ‌డం సులువుగా అనిపించిందా?
మొద‌ట్లో త‌ల్ల‌దండ్రులు ఒప్పుకోలేదు. చెన్నైలో పీజీ చేస్తున్న సమయంలో తమిళ పరిశ్రమ నుంచి కొన్ని అవకాశాలు వచ్చాయి. 'ముందు పీజీ పూర్తి చెయ్. తర్వాత సినిమాలు చేయొచ్చు' అని మా త‌ల్లిదండ్రులు చెప్పారు. అయితే ఒక్క సినిమా చేస్తానన్నా. కానీ. వరుస అవకాశాలు రావడంతో మూడు సినిమాలు చేశా. ఆ మూడు సినిమాలు పూర్తి చేశాక. పీజీ (ఎంఏ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్‌మెంట్ - హెచ్ఆర్‌) కంప్లీట్ చేసి మళ్లీ సినిమాల్లోకి వచ్చాను.
 
'రాజా విక్రమార్క'లో అవకాశం ఎలా వచ్చింది?
దర్శకుడు శ్రీ సరిపల్లి ముందు ఫోన్ చేశారు. తర్వాత చెన్నై వచ్చి కథ చెప్పారు. కథతో పాటు అందులో నా పాత్ర కూడా బాగా నచ్చింది. కథలో హీరోయిన్ రోల్ చాలా ఇంపార్టెంట్. అందుకని, ఓకే చేశా. 
 
సినిమాలో మిమ్మల్ని బాగా ఆకట్టుకున్న అంశం ఏమిటి?
నా పాత్ర పేరు కాంతి. ఆ అమ్మాయి కాలేజీకి వెళుతుంది. అలాగే, తను భరతనాట్యం డాన్సర్. నేను గత పదిహేనేళ్లుగా క్లాసికల్ డాన్స్ నేర్చుకుంటున్నాను. క్యారెక్టర్ పరంగానూ కాంతి చాలా స్ట్రాంగ్. హోమ్ మినిస్టర్ కుమార్తె అయినప్పటికీ కాంతి చాలా సింపుల్ గా ఉంటుంది. హీరోయిన్ పాత్రలో లక్షణాలు నచ్చాయి. 
 
కార్తికేయతో న‌టించ‌డం ప‌ట్ల ఏమి గ్ర‌హించారు?
త‌ను స్నేహ‌పూర్వ‌కంగా మెలుగుతారు. అతని నటన చాలా స‌హ‌జంగా ఉంటుంది. దాంతో కో-ఆర్టిస్టులు కూడా చక్కగా నటించగలరు. కార్తికేయతో వర్కింగ్ ఎక్స్‌పీరియ‌న్స్ బావుంది. అతనితో పాటు సాయి కుమార్, తనికెళ్ల భరణితో స్క్రీన్ షేర్ చేసుకోవడం గౌరవంగా భావిస్తున్నాను. 
 
మ‌రి మీ తాత‌గారు రవిచంద్రన్ నుంచి ఏమి నేర్చుకున్నారు?
దురదృష్టవశాత్తూ నేను సినిమాల్లోకి రాక‌ముందే తాత‌గారు కాలం చేశారు. తాతయ్య చాలా క‌ష్ట‌ప‌డేవారు. ఆయనలో అంకితభావం, క్రమశిక్షణ ఎక్కువ. వ్యక్తిగతంగా నేను ఆ మూడు లక్షణాలు నేర్చుకున్నాను. చిన్నతనం నుంచి నాకు సినిమాలు అంటే ఆసక్తి. కానీ, మా పేరెంట్స్ చాలా స్ట్రిక్ట్ గా ఉండటం తాతయ్యకు ఎప్పుడూ చెప్పలేదు. ఇప్పుడు  తాతయ్య ఉండుంటే నేను చాలా హ్యాపీగా ఫీలయ్యేదాన్ని.
 
క‌మ‌ర్షియ‌ల్ సినిమాల్లో గ్లామ‌ర్ రోల్ చేయాలంటే ఏం చేస్తారు?
నేను గ్లామ‌ర్ రోల్స్ కంటే క‌థ ప్రాధాన్య‌త‌బ‌ట్టి ఆలోచిస్తాను. డాన్స్‌ప‌రంగా సాంప్ర‌దాయం, మోడ్ర‌న్ డాన్స్ కూడా చేయ‌గ‌ల‌ను.
 షూటింగ్ లో తెలుగు మాట్లాడటం ఇబ్బంది అయ్యిందా?
తొలుత‌ కొంత భయపడ్డాను. షూటింగ్ స్టార్ట్ కావడానికి కొన్ని రోజుల ముందు నేను హైదరాబాద్ వచ్చాను. దర్శకుడు శ్రీ నాకు ఇంగ్లిష్ స్క్రిప్ట్ ఇచ్చారు. అలాగే, డైలాగులకు అర్థం వివరించడంతో పాటు తెలుగు డైలాగులకు ఇచ్చాడు. నా పాత్ర డైలాగులు మాత్రమే కాదు. సన్నివేశంలో మిగతా ఆర్టిస్టుల డైలాగులు కూడా ఇచ్చారు. అందువల్ల, నా పని ఈజీ అయ్యింది.
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు