ఇండియన్ సినీ ఇండస్ట్రీని రాజమౌళి హాలీవుడ్ స్థాయికి తీసుకుని వెళ్లారు. కాకపోతో హాలీవుడ్ సినిమాల్లో న్యూడ్ సీన్ల లెవల్లోకి ఇంకా వెళ్లలేదనుకోండి. ఐతే బాలీవుడ్ ఇండస్ట్రీలో నటీనటులు మాత్రం హాలీవుడ్ స్థాయికి చేరుకున్నట్లే కనబడుతున్నారు. లైంగిక సంబంధ విషయాలపై ఎంతమాత్రం సిగ్గు లేకుండా జవాబులు చెప్పేస్తున్నారు. అలాంటి సబ్జెక్టులపై విలేకరులు కూడా అంతకన్నా బిడియం లేకుండా వారికి సంధిస్తున్నారు.
ఇంతకీ విషయం ఏంటయా అంటే... తన తాజా చిత్రం రాబ్తా ప్రమోషన్లో భాగంగా సుశాంత్ కనబడిన విలేకరులకల్లా ఇంటర్వ్యూలు ఇచ్చేస్తున్నాడు. ఇందులో భాగంగా ఓ విలేకరి ప్రశ్నిస్తూ... నీ ఫేవరెట్ లైంగిక భంగిమ ఏది అని ప్రశ్నించాడు ఓ విలేకరి. దానికి సుశాంత్ ఏమాత్రం తడుముకోకుండా తనకు 60ల్లో విషయాలంటే ఇష్టమనీ, అలాగే ఆరు-తొమ్మిది భంగిమ అంటే చాలా ఇష్టమని చెప్పాడు. ఆరు-తొమ్మిది భంగిమ అంటే ఏమిటో అర్థం కాక సదరు విలేకరి టపాటపా గూగుల్ సెర్చ్ చేసి గుడ్లు తేలేసేడట. మరి ఆ భంగిమ ఎలాంటిదో?