ప్రియమణి ప్రధాన పాత్రలో నటించిన భామా కలాపం ఇటీవల అచ్చ తెలుగు ఓటీటీ ఆహాలో విడుదలైంది. సినిమాకు సూపర్‌డూపర్ రెస్పాన్స్ వస్తున్న నేపథ్యంలో ప్రియమణి చిత్రం గురించి, తన భర్త గురించి పలు విశేషాలు తెలియజేసింది. ఆ విశేషాలు.
- ఈ సినిమా చూసుకున్నాక నాకు 100కి 200 శాతం శాటిస్‌ఫేక్షన్ ఉంది. ఇప్పటి వరకు చూసిన వారందరూ చాలా బావుందని మెసేజ్ చేస్తున్నారు. సోషల్ మీడియాలోనూ పాజిటివ్ రిప్లై ఇస్తున్నారు.
- ఈ సినిమాలో నా పోర్షన్ నచ్చింది. లుక్ బావుంది. ఫీల్ బావుంది.... అని ఎక్కువగా మెసేజ్‌లు వస్తున్నాయి.
- నాకు కథ వినగానే నచ్చింది. దర్శకుడు స్టోరీ చెప్పిన విధానం చాలా బాగా నచ్చింది. దర్శకుడు నాకు ఎలా చెప్పారో అలాగే తీశారు.
- నేను ఇంతకు ముందు ఎప్పుడూ మిడిల్ క్లాస్ హౌస్ వైఫ్‌గా నటించలేదు. అందుకే కొత్తగా అనిపించి చేశాను.
- గుడ్డు మీద సినిమా అంతా తిరుగుతుందని దర్శకుడు చెప్పగానే చాలా ఇంట్రస్టింగ్‌గా అనిపించింది.
- అసలు గుడ్డు గురించి ఇంత కథ వినడం చాలా బాగా అనిపించింది. అసలు ఇలాంటి ఎగ్స్ రియల్ లైఫ్‌లో ఉన్నాయని నేను అనుకోలేదు.
- భామా కలాపం సినిమాలో అనుపమ నా హార్ట్ కి క్లోజ్‌గా ఉంటే కేరక్టర్ కాదు. నాకు కొత్తగా అనిపించే చేశా.
- భామాకలాపం సినిమాను రెండు, మూడు సార్లు చూశామని చెప్పిన వారు కూడా ఉన్నారు.
- ఈ సినిమా చేసేటప్పుడు, అంత అమాయకంగా కనిపించడం చాలా కష్టంగా అనిపించింది. స్క్రీన్ మీద బోల్డ్ గా, స్ట్రెయిట్ ఫార్వర్డ్ గా కనిపించడం ఈజీ. కానీ అమాయకంగా కనిపించడం చాలా కష్టం.
- మిడిల్ క్లాస్ అమ్మాయిలు, లేడీస్ ఇంట్లో ఎలా ఉంటారో కనుక్కుని ఈ సినిమా చేశా.
- పక్కవాళ్ల జీవితాల్లో ఇంటర్‌ఫియర్ అయ్యే అలవాటు నాకెప్పుడూ లేదు. అసలు నేనెప్పుడూ ఇంటర్‌ఫియర్ కాను. ఇప్పటిదాకా నా నైబర్ ఎవరో తెలియదు.
- ఎవరైనా నన్ను సలహాలు అడిగితే ఇస్తాను. అంతవరకే కానీ, అవతలివాళ్ల జీవితాల్లోకి తొంగిచూడాలని అనుకోను. .
- నాకు వంట చేయడం రాదు. మా ఆయన వంట చేస్తాడు.
- వంట రూములోకి వెళ్లి ప్రయోగాలు చేయాలని ఎప్పుడూ అనిపించలేదు.
- ఇప్పటిదాకా ఆయనెప్పుడూ నన్ను ఇది చేసి పెట్టు అని అడగలేదు.
- చీరల్లో చాలా బావున్నావు. కామిక్ రోల్‌కి నువ్వు సూట్ అయ్యావు. ఇంకా అలాంటి రోల్స్ వస్తే చేయి అని మా ఆయన అన్నారు. యుఎస్‌లో ఉన్న ఆయన ఆహా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని చూశారు.
- నేను యాక్టర్‌గా శాటిస్‌ఫై కాలేదు. ఫుల్ లెంగ్త్ విలన్ రోల్ చేయాలని ఉంది. ఇప్పటిదాకా అలాంటిది రాలేదు. ఇప్పుడిప్పుడే కథలు వస్తున్నాయి. కానీ ఇంకా మంచిది వస్తే తప్పకుండా చేస్తా.
- ఓటీటీ వల్ల చాలా అడ్వాంటేజ్‌లున్నాయి. సీరీస్‌గానీ, సినిమాలుగానీ చూడొచ్చు. కావాలనిపిస్తే రివైండ్ చేసి చూడొచ్చు. ఆ ఎక్స్ పీరియన్సే వేరు.
- ఇప్పుడున్న పరిస్థితిలో ఓటీటీలు బెస్ట్ డెసిషన్. పరిస్థితిలో మార్పు రావాలి.
- ఓటీటీలు వచ్చాక విమెన్ ఓరియంటెడ్ కంటెంట్ రావడం చాలా ఆనందంగా ఉంది. ఓటీటీ ప్లాట్‌ఫార్మ్ లో అబ్బాయిలకు కూడా చాలా వెరైటీ రోల్స్ వస్తున్నాయి.
- నాకు హోమ్ ఫుడ్ ఇష్టం. ఏదైనా ప్రేమతో చేసిపెడితే తింటాను.
- విరాటపర్వం సినిమాలో భరతక్క అనే కేరక్టర్ చేశా. రానా డిప్యూటీగా చేశా.
- రానా కేరక్టర్‌తో ట్రావెల్ చేసే పాత్ర అది. చాలా స్పెషల్ రోల్. డబ్బింగ్ అంతా అయిపోయింది.
- నారప్పగానీ, విరాటపర్వంగానీ.. ఇలా డిఫరెంట్ కేరక్టర్స్ సెలక్ట్ చేసుకుంటున్నా. నా వరకు వచ్చిన కథలు కన్విన్సింగ్‌గా అనిపిస్తే చేస్తా.
- నేను ఇప్పుడు విరాటపర్వం, మైదాన్ సినిమాలు చేస్తున్నా. కన్నడలో డాక్టర్ 56 ఉంది. తమిళ్‌లో కొటేషన్ గ్యాంగ్ ఉంది. అందులో జాకీష్రాఫ్, సన్నీలియోన్ చేస్తున్నారు. ఫ్యామిలీమేన్3 కూడా ఉంది.
- అసలు పర్టిక్యులర్‌గా కేరక్టర్లు ఏవీ, ఎప్పుడూ నాకు కనెక్టింగ్‌గా అనిపించవు.
- నేనెప్పుడూ దర్శకుల పనితీరులో వేలు పెట్టను. వాళ్లు నాకు సీన్ చెప్పినప్పుడు... క్రియేటివ్‌గా హోల్ సీన్ ఎలా ఉందో చూస్తాను. నాకు ఏమైనా అనిపిస్తే ఇలా చెప్పొచ్చు కదా, ఎక్స్ ప్రెషన్‌తో వెళ్లొచ్చుకదా.. అని అడుగుతుంటా. మరీ అప్రాప్రియేట్‌గా ఉంటే అసలు నోరు తెరవను. డైరక్టర్ చెప్పిన మాటకు ఓకే అంటాను.