- నేను తెలుగమ్మాయిని. కానీ బెంగళూరులో పెరిగాను. నాకు తెలుగులో ఇదే మొదటి సినిమా. ఐదేళ్ల క్రితమే ఈ రంగంలోకి వచ్చాను. మోడలింగ్ నుంచి సినిమాల్లోకి వచ్చాను. కన్నడలో ఐదు సినిమాలు చేశాను. తెలుగులో ఇది నా మొదటి చిత్రం. ఈ సినిమా కోసం ఆడిషన్ చేశారు. నిర్మాత ఆశ మేడంకు నచ్చడంతో తీసుకున్నారు. నీలవేణి పాత్రకు సరిపోతాను అని దర్శకుడు నన్ను తీసుకున్నారు.
- సంపూ పాత్రలో రెండు వేరియేషన్‌లుంటాయి. క్యాలీఫ్లవర్ కారెక్టర్‌కు మరదలు. ఆయన వెంట పడుతూనే ఉంటాను. కానీ ఆయన నన్ను పట్టించుకోరు. అలాంటి పాత్రను పోషించాను. క్యాలీఫ్లవర్ అనే టైటిల్ ఎందుకు పెట్టారో దర్శకుడినే అడగాలి. కానీ ఇది చాలా యూనిక్‌గా ఉంటుంది. ఓ వెజిటబుల్ పేరు పెట్టారేంటి? అని అనుకున్నాను. సంపూ గారికి ఈ టైటిల్ సెట్ అవుతుంది. పోస్టర్ రిలీజ్ చేశాక షాక్ అయ్యాను.
- అన్ని రకాల ఎమోషన్స్ ఉంటాయి. కామెడీ, సస్పెన్స్, థ్రిల్లింగ్, మెసెజ్ ఓరియెంటెడ్ ఇలా సినిమాలో అన్నీ ఉంటాయి. ఈ చిత్రంలో మూడు పాటలుంటాయి. ప్రజ్వల్ మంచి సంగీతాన్ని అందించారు. పోసాని, సంపూ, ముక్కు అవినాష్, రోహిణి, గెటప్ శ్రీను ఇలా అందరితో సీన్లు ఉంటాయి.