బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అని పిలుచుకునే అమీర్ ఖాన్ చిత్రం డంగల్ ప్రపంచవ్యాప్తంగా డిసెంబరు 23న విడుదల కాబోతోంది. ఈ చిత్రం ప్రమోషన్‌లో భాగంగా హైదరాబాద్ వచ్చిన అమీర్ ఖాన్ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. తను చిరంజీవి అభిమానిననీ, చిరంజీవి-పవన్ కళ్యాణ్‌లతో అవకాశం వస్తే నటించాలని ఉందని చెప్పారు.