'అ..ఆ' హిట్టయితే నితిన్‌కు అది తప్పదు... హీరోయిన్ సమంత కామెంట్

బుధవారం, 1 జూన్ 2016 (20:54 IST)
నితిన్, సమంత నటించిన అ..ఆ చిత్రం రేపు విడుదల కాబోతోంది. ఈ నేపధ్యంలో చిత్రం ప్రమోషన్ కార్యక్రమాల్లో హీరోయిన్ సమంత జోరుగా పాల్గొంటోంది. ఆయా మీడియా ఛానళ్లలో వరసబెట్టి ఇంటర్వ్యూలు ఇచ్చేస్తుంది. తాజాగా ఓ ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.... 'అ..ఆ' సినిమా హిట్టయితే నితిన్ కు పెళ్లి తప్పదని జోక్ వేసింది. 
 
నితిన్ సినిమాల్లోకి వచ్చి తన పర్సనల్ లైఫ్ కి టైమ్ కేటాయించడంలేదనీ, 'అ..ఆ' హిట్టయితే నితిన్ కు పెళ్లి చేసేయాలని పేర్కొంది. త్రివిక్రమ్ ఈ చిత్రాన్ని బ్రహ్మాండంగా తెరకెక్కించారని చెప్పిన సమంత.. నితిన్ ఈ చిత్రంలో కొత్త కోణంలో చూడొచ్చని అంటోంది. మొత్తమ్మీద రేపు విడుదల కాబోతున్న అ..ఆ చిత్రంపైన సమంత చాలా టెన్షన్ పడుతున్నట్లు అనిపిస్తోంది.

వెబ్దునియా పై చదవండి