సినిమా బావుంటే ఖచ్చితంగా థియేటర్ కి వస్తారు : నిర్మాత చిరంజీవి (చెర్రీ)
మంగళవారం, 4 ఏప్రియల్ 2023 (18:56 IST)
Producer Chiranjeevi (Cherry)
దర్శకుడు రమేష్ కడూరి మీటర్ కథ రాసుకొని వచ్చినపుడు పెద్ద హీరోతో చేద్దామని అనుకున్నారు. కొంతమంది దగ్గరికి వెళ్ళడం జరిగింది. డేట్స్ ని బట్టి చూద్దామని అనడం కూడా జరిగింది. ఈలోగా కిరణ్ అబ్బవరం ఎస్ఆర్ కల్యాణ మండపం విడుదలైయింది. ఆయనకి చెబితే ఓకే అన్నారు అని చిత్ర నిర్మాత చిరంజీవి (చెర్రీ) అన్నారు.
ఈ చిత్రాన్ని క్లాప్ ఎంటర్‌టైన్ మెంట్ నిర్మిస్తోంది. నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి సమర్పణలో చిరంజీవి (చెర్రీ), హేమలత పెదమల్లు నిర్మిస్తున్న ఈ చిత్రంలో అతుల్య రవి కథానాయికగా నటిస్తోంది. ఔట్ అండ్ ఔట్ మాస్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమా పాటలు, టీజర్, ట్రైలర్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. సమ్మర్ స్పెషల్ గా ఏప్రిల్ 7న సినిమా గ్రాండ్ గా విడుదల కానున్న నేపధ్యంలో నిర్మాత చెర్రీ మీటర్ విశేషాలని విలేకరుల సమావేశంలో పంచుకున్నారు.
ఇంతకుముందు మీరు కొంచెం ప్రయోగాత్మక చిత్రాలు చేశారు కదా ?
గోపీచంద్ గారితో ఒక్కడున్నాడు చేశాం. ఇది ప్రయోగాత్మక చిత్రం. మత్తు వదలరా, హ్యాపీ బర్త్ డే చిత్రాలు కూడా ప్రయోగాత్మక చిత్రాలే. తొలిసారి కమర్షియల్ ఎంటర్ టైనర్ ఫార్మెట్ లో కి వెళితే బావుటుందని మీటర్ చేశాం. కమర్షియల్ ఎంటర్ టైనర్ అంటే సాంగ్స్ ఫైట్స్ కామెడీ అన్నీ ఉన్నప్పటికీ బలమైన కథ వుండాలి. అలాంటి బలమైన కథ మీటర్ కి కుదిరింది. రమేష్ చాలా మంచి కథతో వచ్చాడు. కంటెంట్ పరంగా మీటర్ చాలా స్ట్రాంగ్ వుంటుంది. మంచి కథని ప్రయోగాత్మకంగా చెప్పొచ్చు.. కమర్షియల్ గా కూడా ప్రజంట్ చేయొచ్చు. దర్శకుడు రమేష్.. బాబీ, గోపీచంద్ మలినేని దగ్గర పని చేశాడు కాబట్టి ఆ స్టయిల్, కమర్షియల్ ఎంటర్ టైనర్ గా వుంటుంది.
మీ గత చిత్రాలకు దీనికి ఎలాంటి తేడా గమనించారు ?
ఏ సినిమా అయినా బావుండాలనే తీస్తాం. మీటర్ కూడా మంచి సినిమా కాబట్టే చేశాం. ప్రయోగాత్మక చిత్రాలకు మంచి పేరు రావచ్చు కానీ బాక్సఫీసు దగ్గర కొంచెం తేడా కనిపిస్తుంది. ఇలాంటి సినిమాలకు మాత్రం సినిమా బావుంది అంటే మాత్రం బాక్సాఫీసు రెవెన్యూ బెటర్ గా వుండే అవకాశం వుంటుంది.
మీటర్ కి అనుకున్న బడ్జెట్ కంటే ఎక్కువైయిందని విన్నాం ?
ఏదైనా సబ్జెక్ట్ , దాన్ని తీయడం బట్టి వుంటుంది. ఉదాహరణకు చమ్మక్ చమ్మక్ పోరి పాట వుంది. అది మామూలుగా కూడా తీయొచ్చు. అయితే పాట బావొచ్చింది. దాన్ని గ్రాండ్ గా తీయాలని పెద్ద సెట్ వేశాం. మేము ఎప్పుడు ఖర్చుకి వెనకడుగువేయలేదు. ఎక్కడ అవసరమో అక్కడ పెట్టడానికి రెడీగా వుంటాం. ముత్తువదలరా కోటిన్నర లో చేయాల్సిన సినిమా. కానీ రెండున్నర కోట్లు అయ్యింది. హ్యాపీ బర్త్ డే ఏడు కోట్లలో తీయాలని అనుకున్నాం. ఎనిమిదిన్నర కోట్లు అయ్యింది. మీటర్ కూడా మేము అనుకున్న దాని కంటే కొంచెం ఎక్కువైయింది. అవసరంకి తగ్గట్టే ఖర్చు చేశాం. కిరణ్ కెరీర్ లో హయ్యస్ట్ బడ్జెట్ మూవీ మీటర్.
మైత్రీ మూవీ మేకర్స్ లో చేస్తూనే మీరు ప్రొడక్షన్ చేయడానికి కారణం ?
నేను 31 ఏళ్లుగా ఇండస్ట్రీలో వున్నాను. మనీ, మనీమనీ, గులాబీ, రంగీలా చిత్రాలకు పని చేశాను. తర్వాత యమదొంగ, ఒకడున్నాడు చేసి మళ్ళీ నా వ్యాపార అవకాశాలు కోసం పని చేయడం జరిగింది. మళ్ళీ సినిమాలు చేద్దామని ఇటు వచ్చేసరికి మైత్రీ మూవీ మేకర్స్ వచ్చారు. అక్కడ సిఈవో గా జాయిన్ అయ్యాను. జాయిన్ అయినపుడే నా సినిమాలు చిన్నచిన్నవి వస్తే చేసుకుంటానని ముందే చెప్పాను. దానికి వారు సపోర్ట్ చేస్తానని చెప్పారు. వారితో కలసి పని చేయడం నాకొక అడ్వాంటేజ్.
ఈ ముఫ్ఫై ఏళ్లతో ఇండస్ట్రీలో గమనించిన విషయాలు ?
టెక్నాలజీ చాలా అభివృద్ధి చెందింది. చాలా అప్ గ్రేడ్స్ జరిగాయి. క్యాలిటీ పెరిగింది. మనం కూడా హాలీవుడ్ స్థాయిలో సినిమాలు చూపించగలుగుతున్నాం. ఇంటర్నేషనల్ లెవల్ లో మన మార్క్ చూపించగలిగాం.
కోవిడ్ తర్వాత ప్రేక్షులు ఆలోచనలో ఎలాంటి మార్పులు వచ్చాయి ? ఓటీటీ రాకతో థియేటర్స్ పై ప్రభావం పడిందా ?
శాటిలైట్ వచ్చినపుడు కూడా థియేటర్స్ కి జనం రావడం తగ్గిపోతుందని అన్నారు. ఇప్పుడు ఓటీటీ గురించి కూడా అదే మాట వినిపిస్తుంది. సినిమా అన్ని ఫ్లాట్ ఫార్మ్స్ పై వుంటుంది. అయితే ఇప్పుడు థియేటర్ కాస్త ఖర్చుతో కూడుకున్నది కావడం వలన కాస్త ప్రభావం వుంటుంది. అయితే సినిమా బావుంది అంటే మాత్రం వెళ్తారు.
ఇక పెద్ద హీరోల సినిమాలు మాత్రం ఖచ్చితంగా థియేటర్స్ లో చూడటానికే ఇష్టపడతారు. మొన్న వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య సినిమాలు విడుదల చేశాం. రెండు పెద్ద బ్లాక్ బస్టర్స్ అయ్యాయి. రెండిటికీ మంచి కలెక్షన్స్ వచ్చాయి. దీని అర్ధం.. సినిమా బావుంటే ఖచ్చితంగా ప్రేక్షకులు థియేటర్ కి వచ్చి చూస్తారు.
చిన్న సినిమాలకు స్కోప్ లేదనే సమయంలో బలగం, రైటర్ పద్మభూషణ్ చిత్రాలు విజయాలు సాధించాయి.ఈ దిశలో ఏదైనా ఆలోచిస్తున్నారా ?
చిన్న సినిమాలకు స్కోప్ లేదని నేనెప్పుడు అనుకోలేదు. అనుకోనుకూడా. ఎవరైనా చిన్న సబ్జెక్ట్ చెబితే బావుంటే తప్పకుండా ప్రయోగం చేయడానికి రెడీగా వుంటాను. ఇప్పుడు ఇండస్ట్రీలో చాలా మంచి ప్రతిభ బావుంది. చాలా మంచి కథలతో వస్తున్నారు.