దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగి ప్రస్తుతం బాలీవుడ్‌లో టైం పాస్ చేస్తున్న గోవా బ్యూటీ ఇలియానా. హిందీలో కూడా పెద్దగా సినిమా అవకాశాలు లేకపోయినా, సోషల్ మీడియాలో మాత్రం తెగ హడావిడి చేస్తోంది ఈ స్టార్ బ్యూటీ. హాట్ హాట్ ఫోటోలతో అభిమానులను అలరిస్తూ ఎప్పుడు వార్తల్లో నిలుస్తోంది.
అభిమానులకు కృతజ్ఞతలు తెలపడం కూడా ఇంత హాట్‌గానా అంటూ కొంత మంది పెదవి విరుస్తుంటే, మరి కొంత మంది మాత్రం ఇలియానా అందాలను షేర్ చేస్తూ ఖుషీ చేస్తున్నారు. ప్రస్తుతం ఒక్క ప్రాజెక్ట్ మాత్రమే చేతిలో ఉన్న ఇలియానా సౌత్ ఇండస్ట్రీ పిలుపు కోసం ఎదురుచూస్తోంది.
కాగా, గతంలోతన పుట్టిన రోజు సందర్భంగా ఎంతో ఎంజాయ్ చేశానంటూ తన ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో పోస్ట్ చేసిన విషయం తెల్సిందే. తనకు పుట్టిన రోజు విషెస్ తెలిపిన వారందరికి కృతజ్ఞతలు తెలుతూ.. స్విమ్మంగ్ పూల్‌లో నీటి లోపల తీసిన ఈ హాట్ బికినీ వీడియో పోస్ట్ చేసిన గంటల వ్యవధిలోనే లక్షల్లో నెటిజన్లు వీక్షించారు కూడా.
ఆస్ట్రేలియాకు చెందిన ఫొటోగ్రాఫర్ ఆండ్రూ ఈ వీడియో తీశాడని తెలిపింది. ఆండ్రూతో పీకల్లోతు ప్రేమలో ఇలియానా మునిగితేలుతున్నట్టు, ఆయనతో పెళ్లికి కూడా సిద్ధం అవుతున్నట్లు గత కొన్ని రోజులుగా వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఇపుడు మరో వీడియోను పోస్ట్ చేసి తన అభిమాలను ఖుషీ చేసింది.