Mohan Krishna, Varsha, Tummala
మోహన్ కృష్ణ, వాణి విశ్వనాథ్ కూతురు వర్ష విశ్వనాథ్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా ఘరానా మొగుడు. రాజుబాబు దర్శకత్వంలో యస్.యమ్.కె ఫిలిమ్స్, వి.యన్.ఆర్.ఫిలిమ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. బుధవారం హైదరాబాద్ మణికొండ శివాలయంలో పూజ కార్యక్రమాల తో ప్రారంభమైనది. ముఖ్య అతిథులుగా వచ్చిన తుమ్మలపల్లి రామసత్యనారాయణ క్లాప్ ఇచ్చారు. సీనియర్ దర్శకుడు సాగర్ గౌరవ దర్శకత్వం వహించారు. జెమిని సురేష్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ఏ.ఎస్ రవికుమార్ స్క్రిప్ట్ అందించారు.