చిత్ర బృందం మాట్లాడుతూ, సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఈ నెల 13న ప్రపంచం వ్యాప్తంగా విడుదలకు సిద్దమయింది. ఇప్పటికే ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదల అయిన పాటలు ప్రజాదరణ పొందాయి." శివుడు "రచన, దర్శకత్వం లో పూర్తి ఇండిపెండెంట్ సినిమాగా రూపు దిద్దుకున్న "బ్రాందీ డైరీస్ "వ్యక్తి లోని వ్యసన స్వభావం, దానివల్ల వచ్చే సంఘర్షణ లతో, సహజ మైన సంఘటన లు,సంబాషణలు, పరిణితి వున్న పాత్రల తో అత్యంత ఆసక్తి కరం గా సాగుతుంది అని తెలిపారు.
పూర్తి గా కొత్త నటి నటులతో రూపుదిద్దుకుంది. జానపద గాయకుడు, రచయిత పెంచల దాస్ ఒక పాట ఇవ్వగా, సాయి చరణ్, హరి చరణ్, రవి కుమార్ మందా నేపధ్య గానం అందించారు. ఇప్పటికే విడుదల అయిన ట్రైలర్ కి సాంగ్స్ కి మంచి స్పందన వచ్చింది. ఇటీవలే పెంచల్ దాస్ గారు రాసిన పాట లిరికల్ వీడియో తనికెళ్ళ భరణి గారు విడుదల చేయగా పది లక్షలు వ్యూస్ అందుకొని చిన్న సినిమాల్లో రికార్డు నెలకొల్పింది.