దర్శకుడు చందు మొండేటి తెలుపుతూ, సాంకేతిక నిపుణులకు, నిర్మాతలు , ఆర్టిస్టు లు గురించి చాలాసార్లు మాట్లాడాను. ఇలాంటి కథ సినిమా తీయడానికి నాకు విజ్ఞానాన్ని , వికాసాన్ని నేర్పించిన నా తల్లి తండ్రులకి, కొడుకుల చూసుకున్న మా అన్నయ్యకు ధన్యవాదలు. ఈరోజు నిఖిల్ గురించి బాలీవుడ్ లో కూడా మాట్లాడటం చాలా ఆనందంగా ఉందని, అందరికి కృతజ్ఞతలు తెలిపారు.
నిర్మాత అభిషేక్ అగర్వాల్ మాట్లాడుతూ, మాకు ఇంత బ్లాక్ బస్టర్ ఇచ్చిన దర్శకుడికి, నిఖిల్ కి, అనుపమకు, అలానే డిస్ట్బ్యూటర్స్ అందరికి చాలా పెద్ద థాంక్స్.
నిర్మాత టిజి విశ్వప్రసాద్ మాట్లాడుతూ, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీకి ఇది మొదటి వంద కోట్ల మూవీ మూవీ. మీడియాకు, హీరో నిఖిల్ కి, దర్శకుడు చందు మొండేటికి పతి ఒక్కరికి థాంక్స్.
అనుపమ పరమేశ్వరన్ మాట్లాడుతూ, ప్రేమమ్, శతమానం భవతి సినిమాలు తరువాత ఈ సినిమా నాకు మైల్ స్టోన్. ఈ సినిమా కమర్షియల్ సక్సెస్ అవ్వడం నాకు చాలా ఆనందంగా ఉంది. అలానే మీరు ఇచ్చిన ప్రేమ మాత్రం నాకు చాలా విలువైంది. మా టీం కి కంగ్రాట్స్ చెబుతున్నాను. థాంక్యూ అల్.