మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌కు తిరుమలలో అవమానం జరిగింది. వేలాది మంది భక్తులు తిరుగుతున్న ప్రాంతంలో ఒక భక్తుడు ఉన్నట్లుండి.. సర్.. మీ సినిమాలన్నీ ఫెయిలట సర్ అంటూ ముఖంమీద అడిగేశాడు. దీంతో త్రివిక్రమ్ ఏం మాట్లాడకుండా తలవంచుకుని వచ్చేశారు. తిరుమలలో తెల్లవారు జామున విఐపి విరామ దర్శనా సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు త్రివిక్రమ్ శ్రీనివాస్.
పక్కనే ఉన్న త్రివిక్రమ్ సన్నిహితులు ఎవరు.. ఎవరనగా భక్తుల మధ్యలో ఆ వ్యక్తి సైలెంట్ అయిపోయాడు. అయితే త్రివిక్రమ్ మాత్రం వదిలేయండి అంటూ మెల్లగా చెబుతూ బయటకు వచ్చి మీడియాతో కూడా మాట్లాడకుండా వెళ్ళిపోయారు. అంతకుముందు వరకూ ఉత్సాహంగా కనిపించిన త్రివిక్రమ్ భక్తుని మాటలతో ఆవేదనకు గురై తలవంచుకుని వెళ్ళిపోయారు. గతంలో కొంతమంది డైరెక్టర్లు, సినీ తారలకు కూడా ఇలాంటి అవమానమే ఎన్నోసార్లు తిరుమలలో జరిగింది.