నారా దేవాన్ష్ పుట్టినరోజు .. శ్రీవారి సేవలో సీఎం చంద్రబాబు ఫ్యామిలీ (వీడియో)

బుధవారం, 21 మార్చి 2018 (11:10 IST)
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మనుమడు నారా దేవాన్ష్ పుట్టినరోజు వేడుకలు బుధవారం జరుగుతున్నాయి. దీన్ని పురస్కరించుకుని చంద్రబాబు కుటుంబ సభ్యులు బుధవారం ఉదయం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారిని దర్శించుకున్నారు. చంద్రబాబు కుటుంబ సభ్యులతోపాటు సినీ హీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కుటుంబ సభ్యులు కూడా శ్రీవారిని దర్శించుకున్నారు.
 
దేవాన్ష్ పుట్టినరోజు సందర్బంగా శ్రీవారిని దర్శించుకునేందుకు మంగళవారం సాయంత్రమే కుటుంబ సభ్యులతో కలిసి చంద్రబాబు తిరుమలకు చేరుకున్న విషయం తెల్సిందే. అనంతరం ఇక్కడి పద్మావతి అతిధిగృహంలో బసచేసి, బుధవారం ఉదయాన్నే శ్రీవారిని దర్శించుకుని స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించారు.
 
కాగా, ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబ సభ్యులకు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఘనంగా స్వాగతం పలికి దర్శనం కల్పించారు. అలాగే తన మనుమడు దేవాన్ష్ పుట్టినరోజు సందర్బంగా చంద్రబాబునాయుడు తిరుమల అన్నప్రసాదం ట్రస్టుకు రూ.26 లక్షలను విరాళంగా ఇచ్చారు. 

 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు