పిచ్చెక్కిస్తున్న ధార‌వాహిక‌లు - ప‌ట్టుకోల్పోతున్న ద‌ర్శ‌కులు- స్పెష‌ల్ ఫోక‌స్‌

శనివారం, 7 ఆగస్టు 2021 (17:04 IST)
serials
టీవీ ఛాన‌ల్స్ లో ఏదైనా కార్య‌క్ర‌మం న‌చ్చ‌క‌పోతే వెంట‌నే రిమోట్‌తో మ‌రో ఛాన‌ల్ మార్చేస్తుంటారు. అక్క‌డా అలాంటిదే క‌నిపిస్తే వెంట‌నే మ‌రో ఛాన‌ల్‌కు వెళ‌తారు. అది కూడా అలాగేవుంటే వెంట‌నే ఎంట‌ర్‌టైన్‌మెంట్ కోసం కామెడీ సీన్లు చూస్తారు. ఇలా ప్రేక్ష‌కులు నాడి తెలిసిన కొంద‌రు జ‌బ‌ర్ ద‌స్త్ వంటి కార్య‌క్ర‌మాలు పోటీప‌డి పెడుతున్నారు. అందుకే కొన్ని చాన‌ల్స్‌లో వ‌చ్చే ధార‌వాహిక‌ల‌కు రేటింగ్ ప‌డిపోయింది. ఇందుకు ర‌క‌ర‌కాల కార‌ణాలు వున్నాయి. సినిమాలు స‌రిగ్గా లేక‌పోతే థియేట‌ర్‌కు ప్రేక్ష‌కుడు రాడు. కానీ టీవీ అలాంటిదికాదు. ఎన్నో సీరియ‌ల్స్‌, ఎంట‌ర్‌టైన్‌మెంట్ లు చేతిలో అందుబాటులో వున్నాయి. అయితే ఎంట‌ర్‌టైన్‌మెంట్ మాధ్య‌మంలో ఓ నిబంధ‌న వుంది. ప్రేక్ష‌కుడిని ఎట్టి ప‌రిస్థితుల్లో చెడ‌కొట్ట‌కూడ‌దు. ఆలోచ‌న‌లు పెడ‌దారి పెట్టించ‌కూడ‌దు. కానీ దానిని ఎవ్వ‌రూ స‌రిగ్గా పాటిచండంలేద‌ని అర్థ‌మ‌వ‌తుంది. ఈ సీరియ‌ల్స్ విష‌యంలో ఫిలింఛాంబ‌ర్‌కు చెందిన ప్ర‌సాద్ అనే కార్యవ‌ర్గ స‌భ్యుడు తీవ్రంగా స్పందించారు.
 
ఏ సీరియ‌ల్ చూసినా ఏముంది గ‌ర్వ‌కార‌ణం. ప్రేక్ష‌కుడిని స‌హ‌నానికి ప‌రీక్ష‌లే. బీపీ సుగ‌ర్స్‌లు కొని తెచ్చుకోవ‌డ‌మే అంటున్నాడు. ప్ర‌స్తుతం ఏ ఛాన‌ల్ చూసినా అందులో వ‌చ్చే స‌న్నివేశాలు టెలిప్లే వంటివి ద‌ర్శ‌కుల‌కు అవ‌గాహ‌న‌లోపం తేట‌తెల్ల‌మ‌వుతుంది. సీరియ‌ల్ అంటే మామూలుగా క్లోజ్ షాట్‌లు మామూలే. ఒక సీన్‌లో వుండే ప‌దిమంది ఫీలింగ్స్‌ను క్లోజ్‌లో హావ‌భావాలు ప‌లికించేలా చేసి చూసేవారికి విసుగు క‌లిగించ‌డం తెలిసిందే. కానీ క‌థాగ‌నంలో ఏ సీన్ ఎటువైపు వెళుతుందో ఒక్కోసారి అర్థంకాదు. అందుకు కొన్ని ఎపిసోడ్‌ల‌కు ద‌ర్శ‌కులు మారిపోతుండ‌డ‌మే ఇందుకు నిద‌ర్శ‌నం. ఇలా చాలా ధారావాహిక‌లు ఉదాహ‌ర‌ణ‌గా చెప్ప‌వ‌చ్చు. అయితే ఎక్క‌డా కూడా ఏ సీరియ‌ల్‌లోనూ లాజిక్ అనేవి మాట్లాడ‌కూడ‌దు. ఫ‌లానా సీన్ అలా జ‌రిగింది అంటే జ‌రిగింది అనుకోవాలి. 
 
ఇటీవ‌లే ఓ సీరియ‌ల్‌లో కోర్టుకువ‌చ్చిన సాక్షిని కోర్టుముందు చంపేస్తే.. అది పోలీసులుకానీ, లాయ‌ర్లుకానీ చూడ‌రు. ఇక ఆ సీన్ కోర్టు నుంచి బ‌య‌ట ఎక్క‌డో ఫారెస్ట్‌లో ఛేజ్‌చేసి మ‌రి చంపుతారు దుండ‌గులు. క‌ట్‌చేస్తే బాడీ కోర్టుకు ఎదురుగా క‌నిపిస్తుంది. ఇలా చెప్పుకోపోతే బోల్డ‌ని చిత్ర విచిత్ర విన్యాసాలు క‌నిపిస్తాయి.
 
ఇక ఇదిలా వుంటే, ఓ సీరియ‌ల్‌లో ముసుగువేసుకుని పెండ్లిచేసుకొనే సంప్రాయం వుంటుంద‌ట‌. అందుకే  పెద్దింటికి చెందిన త‌న మ‌న‌వుడు ప్రేమించాడ‌ని పెద్ద‌లంతా క‌లిసి, ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళి పెండ్లి ఫిక్స్ చేస్తారు. దాన్ని సాగ‌దీసి నెల‌పాటు పెండ్లిచేశారు. అయితే శోభ‌నం వ‌ర‌కు ముసుగు తీయ‌కూడ‌ద‌నేది రూల్‌. ఇక శోభ‌నం రోజు ఆ ముసుగులో మ‌రో అమ్మాయి క‌నిపిస్తుంది. పెండ్లికొడుకు ఈ అమ్మాయి త‌ను ప్రేమించిన అమ్మాయి కాద‌ని గ‌ట్టిగా చెప్ప‌లేడు. లోలోప‌ల అత‌ను మ‌ద‌న‌ప‌డ‌తాడు. పైకి చెప్ప‌డు. ఇది చూసేవారికి న‌ర‌క‌మే. 2021 సంవ‌త్స‌రంలో యువ‌త ఎంత ఫాస్ట్‌గా వుంటున్నారో తెలిసి కూడా ఆ ద‌ర్శ‌కుడు, నిర్మాత‌లు కూడా బూజుప‌ట్టిన క‌థ‌ల‌తో సీరియ‌ల్స్ తీయ‌డంపై ప‌లువురు చికాకు వ్య‌క్తం చేస్తున్నారు. ఇలా ఒక‌టికాదు. రెండుకాదు.. ఏ ఛాన‌ల్‌పెట్టినా ఇదే తంతు. ఇలాంటివి చూపించి ప్రేక్ష‌కులకు బీపీ, సుగ‌ర్‌లు ఎక్కువ చేస్తున్నారు నిర్వాహ‌కులు.
 
ఇక‌, చేయ‌ని త‌ప్పుకు శిక్ష‌ను మౌనంగా పాటించే సాంప్ర‌దాయం అన‌సూయ‌, సావిత్రి కాలంనాటిది. వారు కూడా ఓద శ‌లో తిర‌గ‌బ‌డ‌తారు. ప్ర‌శ్నిస్తారు. కానీ సీరియ‌ల్‌లో ఏ మ‌హిళ‌కానీ, యే పురుషుడు కానీ తాను త‌ప్పుచేయ‌లేదు. తాను ఇది అని గ‌ట్టిగా వాదించ‌లేడు. బ‌ల‌వంతంగా అనుభ‌వించాల్సిందే అంటూ ఓ రూల్ రాసుకుని సీరియ‌ల్ చేస్తున్నారు. మిగ‌తా భాష‌లైన బెంగాల్‌, మ‌రాఠి, ఉత్త‌రాది సీరియ‌ల్స్‌లో క‌థ‌లు అభివృద్ధివైపు వెళ్ళేలా సీరియ‌ల్స్ వుంటే, తెలుగులో మాత్రం నాసిర‌కంగా తయారైంద‌ని తెలంగాణ టెలివిజ‌న్ అసోసియేష‌న్ అధ్య‌క్షుడు సురేష్ విమ‌ర్శిస్తున్నారు. అందుకే త్వ‌ర‌లో సీరియ‌ల్స్‌పై సెన్సార్ వుండాల‌ని గతంలో ప‌లువురు వాదించారు. కానీ ఇంత‌వ‌ర‌కు అది సాధ్య‌ప‌డలేదు.చూద్దాం ఏం జ‌రుగుతుందో.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు