సూపర్ స్టార్ మహేష్ బాబు - సక్సస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్లో రూపొందుతోన్న భారీ చిత్రం సరిలేరు నీకెవ్వరు. మహేష్ సరసన రష్మిక నటిస్తుంది. ఈ చిత్రాన్ని దిల్ రాజు, అనిల్ సుంకర, మహేష్ బాబు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కాశ్మీర్‌లో ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం సెకండ్ షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటోంది.
అయితే... దర్శకుడు అనిల్ రావిపూడి ట్విట్టర్లో స్పందిస్తూ... సెకండ్ షెడ్యూల్ షూటింగ్ ఫుల్ స్వింగ్‌లో జరుగుతోంది. సంక్రాంతికి థియేటర్లలో ఒక హిలేరియస్ ట్రైన్ జర్నీని చూడబోతున్నారు. సూపర్ స్టార్ మహేష్ గారు ఇచ్చే ఎంటర్టైన్మెంట్‌కు సిద్ధంగా ఉండండి అంటూ మహేష్ ట్రైన్‌లో నిలుచున్న స్టిల్ పోస్ట్ చేసారు. ఈ స్టిల్ అదిరింది అనేలా ఉంది.