Is it Actor Allu Arjun Arrested హైదరాబాద్ నగరం, ఆర్టీసీ క్రాస్ రోడ్డు వద్ద ఉన్న సంధ్య థియేటర్‌లో ఈ నెల 5వ తేదీన జరిగిన తొక్కిసలాట ఘటనకు సంబంధించి హీరో అల్లు అర్జున్‌ను పోలీసులు అరెస్టు చేసినట్టు ఓ వర్గం మీడియా కథనాలను ప్రసారం చేస్తుంది. మరికొందరు మాత్రం ఈ ఘటనకు సంబంధించి వివరాలను సేకరించే నిమిత్తం చిక్కడపల్లి పోలీసులు స్టేషన్‌కు తీసుకెళ్లినట్టు చెబుతున్నారు.
పుష్ప-2 చిత్రం ప్రీమియర్స్ సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందగా, ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్ర అస్వస్థతకు లోనై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. దీనికి సంబంధించి అల్లు అర్జున్‌తో పాటు సంధ్య థియేటర్ యజమాని, మేనేజర్‌పై కేసు నమోదైవున్న విషయం తెల్సిందే.