తన ప్రమాణ స్వీకారోత్సవానికి బాలక్రిష్ణ, కోట శ్రీనివాసులను ఇంటికెళ్ళి ఆహ్వానించిన మంచు విష్ణు మెగాస్టార్ కుటుంబాన్ని మర్చిపోయారు. చిరంజీవిని గానీ, పవన్ కళ్యాణ్‌ను గానీ పిలవలేదు. దీంతో మెగా అభిమానులు మండిపడుతున్నారు.
సినిమాల్లో నటించే ప్రతి ఒక్కరూ సభ్యులే. 900 మందిలో మంచు విష్ణును గెలిపించిన సభ్యులు ఎంతమంది ఉంటారో, ప్రకాష్ రాజ్‌కు ఓటేసిన సభ్యులు అదే స్థాయిలో ఉన్నారన్నది అందరికీ తెలిసిందే. తక్కువ ఓట్లతోనే ప్రకాష్ రాజ్ ఓడిపోయిన విషయం తెలిసిందే.
సభ్యుల మధ్య వైరం కాస్త ఇలాగే కొనసాగి ఏస్థాయికి చేరుతుందోనంటున్నారు సినీ విశ్లేషకులు. ఎవరో ఒకరు సర్దుకుపోవాలే తప్ప ఇలా ఒకరిపై ఒకరు ఇంకా ఆరోపణలు, ప్రత్యారోపణలు, విమర్సలు, ప్రతి విమర్సలు చేసుకుంటూ పోతే ఉపయోగం ఉండదంటున్నారు. మరి చూడాలి మా అసోసియేషన్ సినిమాకు శుభం కార్డు పడుతుందా లేదా అన్నది.