జనతా గ్యారేజ్‌కి తర్వాత "ధడ్కన్''లో ఎన్టీఆర్.. పోలీసాఫీసరుగా..?

శనివారం, 27 ఆగస్టు 2016 (10:18 IST)
జనతా గ్యారేజ్ సినిమా సెప్టెంబర్ 1న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానున్న నేపథ్యంలో గురువారం ఆ సినిమాకు సెన్సార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సెన్సార్ బోర్డు ఈ సినిమాకి యు/ఎ సర్టిఫికెట్‌ను ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా రిలీజ్ కాకముందే తదుపరి సినిమాలో నటించేందుకు ఎన్టీఆర్ ఒప్పేసుకున్నాడు. గతంలో వక్కంతం వంశీ దర్శకత్వం లో ఎన్టీఆర్ ఓ సినిమా చేయనట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. 
 
తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాను తన సోదరుడు కళ్యాణ్ రామ్ అతని సొంత బ్యానర్‌లో నిర్మిస్తున్నాడు. అందుకోసం "ధడ్కన్ " అనే టైటిల్ కూడా రిజిస్టర్ చేసాడు. ఈ టైటిల్ ఎన్టీఆర్‌కు పిచ్చిపిచ్చిగా నచ్చేసింది అంటున్నాయి ఫిల్మ్ వర్గాలు. ఈ సినిమాలో హీరో నిజాయితీపరుడైన పోలీస్ ఆఫీసర్‌గా కనిపించబోతున్నాడు. సినిమా లోని ఓ ముఖ్య పాత్రకోసం జగపతి బాబును ఎంపిక చేసినట్టు సమాచారం.

వెబ్దునియా పై చదవండి