అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తెగా పేరు తెచ్చుకుని ఇటీవలే బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన జాన్వీ కపూర్‌పై శ్రీదేవి అభిమానుల్లో ఎన్నో ఆశలు ఉన్నాయి. శ్రీదేవి మార్చి7, 1997న ముంబైలో జాన్వీకి జన్మనిచ్చింది. జాన్వీ పుట్టిన తర్వాతే, బోనీ శ్రీదేవిని వివాహం చేసుకున్నాడు. శ్రీదేవితో బోనీ సంబంధం అప్పట్లో వివాదానికి కేంద్రంగా మారింది.
పుట్టిన తేదీ- మార్చి 06, 1997
వయస్సు- 25 సంవత్సరాలు
రోజు- గురువారం
స్వస్థలం- ముంబై, మహారాష్ట్ర, భారతదేశం
రాశిచక్రం -మీనం
జాన్వీ ప్రస్తుతం బాలీవుడ్‌లోనే కాకుండా సౌత్ ఇండియన్ సినిమాల్లో కూడా నటిస్తోంది. ఆమె తండ్రి, బోనీ కపూర్, నిర్మాత. ఆమె చెల్లెలు ఖుషీ కపూర్. సల్మాన్ ఖాన్, షాహిద్ కపూర్, దిలీప్ కుమార్ జాన్వీ కపూర్ అభిమాన నటులు. కరీనా కపూర్, వహీదా రెహ్మాన్, నూతన్, మధుబాల నచ్చిన నటీమణులు. ఆమె అభిరుచులలో సంగీతం వినడం, ప్రయాణం చేయడం వంటివి ఉన్నాయి.