ఆ తర్వాత ఆయన వద్ద జరిపిన విచారణలో అనేక విషయాలను వెల్లడించారు. తన తల్లి అనారోగ్యానికి గురికావడంతో ఆమె వైద్యానికి డబ్బులు లేక, మరో గత్యంతరం లేక ఒకే ఒక్కసారి ఎర్రచందనం స్మగ్లింగ్ చేశానని చెప్పాడు. అదేసమయంలో తనపై 20 కేసులు ఉన్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని హరిబాబు చెప్పాడు. తిరుపతి ట్రాఫిక్ పోలీస్ విభాగంలో పని చేసే ఓ కానిస్టేబుల్ నాపై కక్ష కట్టి.. ఈ కేసుల్లో ఇరికించినట్లు చెబుతున్నాడు.
గతంలో టాస్క్‌ఫోర్స్ విభాగంలో పనిచేసి.. ఇటీవలే ట్రాఫిక్ విభాగానికి బదిలీ అయిన ఆ కానిస్టేబుల్ తనపై కక్ష సాధించడం కోసమే తనను ఈ కేసులో ఇరికించాడని ఆరోపించాడు. అయితే, పోలీసుల వాదన మాత్రం మరోలా ఉంది. కొన్ని సంవత్సరాలుగా తప్పించుకు తిరుగుతున్న హరిబాబుపై 10 పోలీస్ స్టేషన్లలో.. 13 కేసులు ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. ఇప్పటికే ఓసారి పట్టుబడినట్లు కూడా చెబుతున్నారు.