భార్య మీద అలిగిన ఓ భర్త కరెంట్ స్తంభం ఎక్కాడు, ఆ తర్వాత?

సెల్వి

బుధవారం, 1 అక్టోబరు 2025 (15:47 IST)
భార్య మీద అలిగిన ఓ భర్త కరెంట్ స్తంభం ఎక్కాడు. భార్య భోజనం పెట్టేందుకు నిరాకరించడంతో తీవ్ర ఆగ్రహానికి గురైన భర్త.. కరెంట్ స్తంభం ఎక్కాడు. వివరాల్లోకి వెళితే.. సిరికొండ మండలం కోమన్ పల్లి గ్రామానికి చెందిన సుమన్ అనే వ్యక్తికి, అతని భార్యకు మధ్య గొడవ జరిగింది. 
 
ఈ క్రమంలో భార్య అతనికి భోజనం పెట్టేందుకు నిరాకరించింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన సుమన్, మద్యం సేవించి గ్రామ శివార్లలోని ఓ విద్యుత్ స్తంభం ఎక్కాడు. ఇది గమనించిన స్థానికులు వెంటనే అప్రమత్తమై విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. స్తంభంపైకి ఎక్కిన సుమన్ కిందకు దిగేందుకు నిరాకరించాడు.
 
దాదాపు రెండు గంటల పాటు ఈ హైడ్రామా కొనసాగింది. చివరకు పోలీసులు ఎంట్రీ ఇచ్చి.. అతనికి నచ్చజెప్పి సురక్షితంగా కిందకు దించారు. దీంతో అతని కుటుంబ సభ్యులు, గ్రామస్థులు ఊపిరి పీల్చుకున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు