కాగా, గత రాత్రి చేసిన డ్రంకెన్ డ్రైవుల్లో చాలా మంది పోలీసులకు చిక్కారు. ఈ తనిఖీల్లో ఐదు కార్లు, రెండు ఆటోలతో పాటు 12 బైక్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారందరిపైనా పోలీసులు కేసులు నమోదు చేశారు. డ్రంకెన్ డ్రైవ్ చేసిన వారికి కౌన్సెలింగ్ ఇవ్వనున్నారు.
కాగా.. మిగతా రోజులతో పోలిస్తే వీకెండ్స్‌లో హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో పోలీసులు డ్రంకెన్ డ్రైవ్‌లను ముమ్మరంగా చేస్తున్న విషయం తెలిసిందే. అలాగే శుక్రవారం(ఫిబ్రవరి 5,2021) కూడా డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు చేశారు. జూబ్లీహిల్స్ లో తనిఖీలు చేస్తుండగా తన్మయి పట్టుబడ్డాడు.
డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో భాగంగా పోలీసులు 5 కార్లు, 2 ఆటోలు, 12 బైక్ లు స్వాధీనం చేసుకున్నారు. తనిఖీల్లో పట్టుబడ్డ వారిని కోర్టులో హాజరుపరుస్తామని, శిక్ష పడేలా చూస్తామని పోలీసులు తెలిపారు.