ఇంకా ఆర్పీ మాట్లాడుతూ... సాధ్యం, గురుడు, గేమ్ వంటి సినిమాలకు తాను అసిస్టెంట్ డైరక్టర్‌గా పనిచేశానని.. ఇదేవిధంగా పెద్ద దర్శకుడిగా మారాలని శతవిధాలా ప్రయత్నిస్తున్నానని చెప్పాడు.
నెల్లూరు జిల్లాలోని ఓజిలి మండలం, సగటూరు నుంచి హైదరాబాద్ వచ్చిన తాను.. డిగ్రీ పూర్తయ్యాక అసిస్టెంట్ డైరక్టర్‌గా పనిచేశానని చెప్పాడు. షూటింగ్ లేని సమయంలో సగటూరుకు వచ్చి సొంతూరి స్నేహితులను కలుసుకుంటుంటానని ఆర్పీ చెప్పుకొచ్చాడు. గతంలో టెంపర్ స్పూఫ్‌తో పాటు పలు కామెడీ స్కిట్లతో ఆర్పీ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన సంగతి తెలిసిందే.