హాయి క‌లిగించే తీయ‌ని బాధ‌ను వ్య‌క్తం చేస్తున్న జాక్వలైన్

గురువారం, 5 ఆగస్టు 2021 (17:27 IST)
Jacqueline
హీరోయిన్లు అందులోనూ బాలీవుడ్ భామ‌లు టాటూస్‌ను వేయించుకోవ‌డం ప‌రిపాటే. భుజాల‌పైన, చేతుల‌లోనూ వీపుపైన అలా త‌మ‌కు ఇష్ట‌మైన గుర్తును, లేదా న‌చ్చిన వ్య‌క్తి పేరును పొడిపించుకుని త‌న ప్రేమ‌ను వ్య‌క్తం చేస్తుంటారు. అయితే హాలీవుడ్ భామ‌ల‌యితే త‌మ‌కిష్ట‌మైన చోట్ల అలా వేయించుకుని థ్రిల్ క‌లిగిస్తారు. ఇప్పుడు జాక్వలైన్ ఫెర్నాండెజ్ కూడా అదే చేస్తుంది. బొడ్డుకు ఎడ‌మ‌వైపున ఇలా టాటూను ముద్రించుకుంటూ త‌న్మ‌యంతో కాస్త తీయ‌ని బాధ‌ను వ్య‌క్తం చేస్తూ ఫొటోకు ఫోజు ఇచ్చింది.
 
దీనిపై ఆమె అభిమానులు వెరీగుడ్ అంటూ కొంద‌రంటే, బీరెడీ జాక్విలెన్‌కు పోటీగా అంటూ మ‌రికొంద‌రు కామెంట్ చేశారు. జాక్వలైన్ ఫెర్నాండెజ్ తాజాగా కిచ్చా సుదీప్ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తోన్న చిత్రం ‘విక్రాంత్ రోణ‌’. 3డీలో న‌టిస్తోంది. ఇందులో ప్ర‌త్యేక గీతంలో న‌టిస్తుంది. ఈ గీతంలో ఆమె టాటూ క‌నిపించేలా చేసింది. రాక్వెల్ డీ కోస్టా అలియాస్ గ‌దంగ్ రాక్క‌మ్మగా జాక్వ‌లైన్ ఫ‌స్ట్ లుక్ ఇటీవ‌లే విడుద‌లైంది. దీనికి మంచి స్పంద‌నే వుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు