నందమూరి ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న జై లవ కుశ చిత్రం మరో మూడు రోజుల్లో విడుదల కాబోతోంది. ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ సరసన రాశి ఖన్నా, నివేదా థామస్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ మూడు విభిన్న పాత్రల్లో నటిస్తున్నాడు.
చిత్రం విడుదల సందర్భంగా రాశి ఖన్నా, నివేదా థామస్ చిత్ర షూటింగ్ సమయంలోని విషయాలను పంచుకున్నారు. జూనియర్ ఎన్టీఆర్ నటన గురించి చెప్తూ... ఆయన ఒకేరోజు 70 కాస్ట్యూమ్స్ మార్చాల్సి వచ్చేదనీ, ఆయన నటన చూసినప్పుడు తనకు అద్భుతంగా అనిపించిందనీ చెప్పుకొచ్చింది నివేదా థామస్. కాగా ఈ చిత్రం సెప్టెంబరు 21న విడుదల కాబోతోంది. దసరా పండుగ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ తన ఫ్యాన్స్‌కు కానుకగా ఈ చిత్రం రానుంది.