Tomato virus: మధ్యప్రదేశ్‌లో విజృంభించిన టమోటా వైరస్.. చిన్నారులు జాగ్రత్త

సెల్వి

గురువారం, 2 అక్టోబరు 2025 (15:54 IST)
tomato virus
టమోటా వైరస్ మధ్యప్రదేశ్‌లో విజృంభించింది. ఇది చిన్నారుల్లో అతి వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఈ వైరస్ సోకిన వాళ్లలో చేతులు, అరికాళ్లు, పాదాలు, నోటిలో, మెడ కింద ఎర్రటి దద్దుర్లు కనిపిస్తున్నాయి. ఒకరి నుంచి ఒకరికి ఈ వైరస్ వ్యాపిస్తోంది. ఈ లక్షణాలతో బాధపడే చిన్నారులను ఇంటికే పరిమితమైపోయారు. 
 
పాఠశాల యాజమాన్యాలు కూడా ఈ వైరస్ సోకిన పిల్లలను ఇంటి వద్దే ఉంచాలని సూచిస్తున్నాయి. ఈ వైరస్ సోకినవారు దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు వచ్చే తుంపర్ల నుంచి ఒకరినుంచి మరొకరికి వ్యాపిస్తుందని తెలిపారు. లాలాజలం లాంటి శరీర స్రావాలతో కూడా సోకుతుందని తెలిపారు. 
 
ఈ వైరస్ వచ్చిన 3 నుంచి 6 రోజుల్లో లక్షణాలు కనిపిస్తాయన్నారు. చిన్నారులు సరిగ్గా చేతులు కడుక్కోకపోవడం, పరిశుభ్రత పాటించకపోవడం వల్లే ఈ వైరస్ వ్యాపిస్తుందని వెల్లడించారు.
 
లక్షణాలు.. 
దురద, మంట, గొంతునొప్పి, జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తున్నాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు