ఈ సందర్భంగా హీరో, నిర్మాత అనిల్ ఆర్క కండవల్లి మాట్లాడుతూ...`` శ్మశాన వాటికలో పెరిగి పెద్దైన ఓ యుకుడి ప్రేమకథా చిత్రమిది. భద్రాచలం దగ్గర రుద్రంకోట అనే ఊరి నేపథ్యంలో కథ నడుస్తుంది. ఇప్పటి వరకు ఎవరూ చూపించని అంశాలను మా చిత్రంలో చూపిస్తున్నాము. ఇందులో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలుంటాయి. సీనియర్ నటి జయలలిత గారు సమర్పకులుగా వ్యవహరిస్తూ ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో నటించారు. ప్రముఖ సంగీత దర్శకులు కోటి గారు మా చిత్రానికి అద్భుతమైన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు. సుభాష్ ఆనంద్ అందించిన రెండు పాటలు ఇప్పటికే విడుదలై ప్రజాదరణ పొందాయి. ఇటీవల సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. సెన్సార్ ప్రముఖులు యుబైఏ సర్టిఫికెట్ తో పాటు సినిమా బావుందంటూ ప్రశంసించారు. మా సినిమా నచ్చడంతో స్క్రీన్ మాక్స్ పిక్చర్స్ వారు విడుదల చేయడానికి ముందుకొచ్చారు. సెప్టెంబర్ 22న వరల్డ్ వైడ్ గా సినిమాను గ్రాండ్ గా విడుదల చేయనున్నాం`` అన్నారు.
సీనియర్ నటి జయలలిత, ఆలేఖ్య, బాచి, రమ్య తదితరులు నటిస్తోన్న ఈ చిత్రానికి డిఓపీః ఆదిమల్ల సంజీవ్; సంగీతంః సుభాష్ ఆనంద్, నిరంజన్; ఎడిటర్ః ఆవుల వెంకటేష్; కొరియెగ్రఫీః కీర్తి శేషులు శివశంకర్ మాస్టర్ , సుచిత్ర చంద్రబోస్; ఫైట్స్ః జాషువా; డైలాగ్స్ః రంగ; లిరిక్స్ః సాగర్; డిజైనర్ః వివా రెడ్డి; పీఆర్ ఓః చంద్ర వట్టికూటి, మోహన్ తుమ్మల, జీకే మీడియా; నిర్మాతః అనిల్ ఆర్కా కండవల్లి; స్టోరి-స్క్రీన్ ప్లే-దర్శకత్వంః రాము కోన.