జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ దర్శకత్వంలో నటిస్తున్న సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించనుంది. జాన్వీ కపూర్ కూడా కొంత కాలంగా తెలుగు సినిమా చేయడానికి ఆసక్తిని చూపుతోంది. ఈ సినిమాతో ఆమెను తెలుగు తెరకు పరిచయం చేయాలనే ఉద్దేశంతో త్రివిక్రమ్ వున్నాడని అంటున్నారు.
ఒకవేళ జాన్వీ కపూర్ డేట్స్ సర్దుబాటు చేయలేకపోతే, పూజా హెగ్డేను తీసుకుందామనే నిర్ణయానికి వచ్చేశారని చెప్తున్నారు. ఈ ముగ్గురి కాంబినేషన్లో ఇంతకుముందు వచ్చిన ''అరవింద సమేత'' భారీ విజయాన్ని నమోదు చేసిన సంగతి తెలిసిందే.