రంగస్థలం "జిగేలు రాణి" పాట మేకింగ్ వీడియో

ఆదివారం, 6 మే 2018 (14:18 IST)
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, సమంత జంటగా నటించిన చిత్రం "రంగస్థలం". ఈ చిత్రానికి సుకుమార్ దర్శకుడు. మార్చి నెలాఖరులో విడుదలైన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా బ్లాక్‌బస్టర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుని, కలెక్షన్ల వర్షం కురిపించింది. ఇప్పటికీ ఈ చిత్రం మంచి వసూళ్లనే సాధిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రంలోని ఒక్కో పాటకు సంబంధించిన మేకింగ్ వీడియోను చిత్ర యూనిట్ యూట్యూబ్‌లో రిలీజ్ చేస్తోంది.
 
ఇందులోభాగంగా, ఈనెల మూడో తేదీన 'జిగేలు రాణి' అనే ఐటమ్ సాంగ్‌కు సంబంధించిన మేకింగ్ వీడియోను రిలీజ్ చేసింది. ఈ పాటలో హీరోయిన్ పూజా హెగ్డే ఐటమ్ గర్ల్‌గా కనిపించిన విషయం తెల్సిందే. డీఎస్పీ సంగీత బాణీలు సమకూర్చారు. ఈ వీడియోను ఇప్పటికే 26 లక్షల మంది వీక్షించగా, 25 వేల మంది లైక్ చేశారు. ఆ మేకింగ్ వీడియోను మీరూ చూడండి. 

 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు