పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌తో అజ్ఞాతవాసి సినిమా రిలీజ్‌కు సిద్ధమవుతున్న వేళ... యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో సినిమాకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సిద్ధం అవుతున్నారు. ఈ క్రమంలో ఈ సినిమా కోసం త్రివిక్రమ్ స్క్రిప్ట్ వర్క్‌లో బిజీ బిజీగా వున్నారని తెలిసింది. ఎన్టీఆర్‌తో సినిమా ఇటీవల పవన్ చేతుల మీదుగా ప్రారంభమైన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో త్రివిక్రమ్ స్క్రిప్ట్‌కు తారక్ ఒళ్లు తగ్గిస్తే బాగుంటుందని తెలిసింది. చాలామంది త్రివిక్రమ్‌కు కూడా ఇదే చెప్పారట. అంతే త్రివిక్రమ్ వెంటనే ఎన్టీఆర్‌తో కాస్త స్లిమ్ అవ్వాలని సూచించారట. అంతేకాకుండా.. పది కిలోల బరువు తగ్గితే బాగుంటుందని చెప్పారట. త్రివిక్రమ్ చెప్పడమే ఆలస్యం తారక్ కసరత్తులు మొదలు పెట్టేసినట్లు తెలుస్తోంది.