దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ బయోపిక్ రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా రెండు భాగాలుగా తెరకెక్కుతోంది. ఇందులో తొలి భాగమైన కథానాయకుడుకి సంబంధించిన సన్నివేశాలు, పాటలను శరవేగంగా చిత్రీకరిస్తున్నారు.
ఈ సినిమా ఆరంభంలో ఎన్టీరామారావు గురించిన వాయిస్ ఓవర్ ఉంటుందట. ఆ వాయిస్ ఓవర్‌ను యంగ్ ఎన్టీఆర్‌తో చెప్పించాలనే ఆలోచనలో టీమ్ ఉందని టాక్. అదే జరిగితే జూనియర్ ఎన్టీఆర్ వాయిస్ ఓవరే ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా వుంటుందని సమాచారం. సంక్రాంతి కానుకగా జనవరి 9వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో శ్రీదేవిగా రకుల్, జయప్రదగా తమన్నా కనిపిస్తున్నారు.
ఈ చిత్రంలో భరత్ రెడ్డి ఫస్ట్ లుక్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ పోస్టర్‌లో ఎన్టీఆర్ వెనక నిలబడి ఉన్న దగ్గుబాటిగా భరత్ రెడ్డి అలరిస్తున్నాడు. ఇప్పటికే ఎన్టీఆర్, దగ్గుబాటి మధ్య వచ్చే సన్నివేశాలను దర్శకుడు క్రిష్ తెరకెక్కించినట్టు తెలుస్తోంది.