కరోనా లాక్ డౌన్ సమయంలో ఒక్కొక్కరు ఒక్కో విధంగా టైం పాస్ చేశారు. ముఖ్యంగా సినీప్రముఖులైతే ఎక్కువగా ఫిట్నెస్ మీదే దృష్టి పెట్టారు. ఎందుకంటే మళ్ళీ సినిమాల్లో నటించాలంటే ఫిట్నెస్ ముఖ్యం కదా... అందుకే. కాజల్ అగర్వాల్ కూడా ఖాళీ సమయంలో ఆ రెండు నేర్చుకుందట.
మొదటిది ఉత్తేజంగా ఉండడం. షూటింగ్ సమయంలో ఏ విధంగాను అలసి పోకూడదు. అందుకే ఉత్తేజంగా ఉండడానికి ఆధ్యాత్మిక పుస్తకాలను చదువుతున్నానని చెబుతోంది కాజల్. మెదడు షార్ప్‌గా ఉండేందుకు ఆన్ లైన్లో చెస్ ఆడుతుందట.
అస్సలు చెస్ ఆడటమే రాని కాజల్ ఇప్పుడు ఎవరినైనా చెస్‌లో ఎదిరించగలనని చెబుతోంది. నా మైండ్ చాలా షార్ప్ ఇప్పుడు. నేను ఆడుతున్న చెస్ తోనే నా మైండ్ ఎంత షార్ప్‌గా ఉందో నాకే తెలుస్తుంది అని చెబుతోంది.
అంతే కాదు కేంద్రప్రభుత్వం ఆధ్వర్యంలో నడుపబడే దూరదర్సన్ ఛానల్‌లో లాక్ డౌన్ సమయంలో వచ్చిన రామాయణం, మహాభారతం సీరియళ్ళు తనకు ఎంతగానో నచ్చాయంటోంది. ఆ సీరియళ్ళను కూడా చూస్తూ లాక్ డౌన్ సమయాన్ని వెళ్లదీశానని ఎంతో సంతోషంగా చెబుతోంది కాజల్ అగర్వాల్.