అవకాశాల కోసం పడకగదికి పిలుస్తారు.. ఇది అబద్ధం కాదు.. కాజల్

మంగళవారం, 5 ఫిబ్రవరి 2019 (12:03 IST)
సినీ ఇండస్ట్రీలోని లైంగిక వేధింపులపై అగ్ర హీరోయిన్ కాజల్ అగర్వాల్ నోరు విప్పింది. సినిమా ఇండస్ట్రీలో తన మార్కెట్ గురించి తానెప్పుడూ ఆలోచించలేదని కాజల్ తెలిపింది. ఎప్పటికప్పుడు తనకు అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయని తెలిపింది. ఈ కారణంగానే పెళ్లి చేసుకోవాలనే ఆలోచనను పక్కన బెట్టానని కాజల్ చెప్పుకొచ్చింది. 
 
ఇక సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ గురించి కూడా కాజల్ నోరు విప్పింది. అవకాశాల కోసం పడకగదికి పిలుస్తున్నారని చాలామంది హీరోయిన్లు చెప్తున్నారు. అది అబద్ధం కాదని కాజల్ స్పష్టం చేసింది. కానీ అలాంటి సంఘటనలు తాను ఎదుర్కోలేదని కాజల్ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం కాజల్ అగర్వాల్ తేజ దర్శకత్వంలో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా నటిస్తున్న ''సీత'' అనే సినిమాలో నటిస్తోంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు