కాజల్ అగర్వాల్ పి.హెచ్‌.డి ఎక్కడో తెలుసా?

బుధవారం, 22 మే 2019 (10:36 IST)
తేజ దర్శకత్వం వహించిన 'ల‌క్ష్మీక‌ల్యాణం' సినిమాతో టాలీవుడ్‌లో తెరంగేట్రం చేసిన పంజాబీ ముద్దుగుమ్మ కాజ‌ల్ అగ‌ర్వాల్‌ అన‌తి కాలంలోనే తెలుగు, త‌మిళ‌ంతోపాటు పలు హిందీ చిత్రాలలోనూ న‌టించి స్టార్ హీరోయిన్‌గా పేరు సంపాదించుకుంది. అలాగే త‌న కెరీర్‌లో హీరోయిన్‌గా 50 సినిమాల‌ మైలురాయిని కూడా చేరుకుంది. 
 
అయితే తన 50వ సినిమాగా త‌న తొలి చిత్ర ద‌ర్శ‌కుడు తేజ‌ దర్శకత్వంలోని 'నేనే రాజు నేనే మంత్రి' సినిమాలో న‌టించిన ఈ టాలీవుడ్ 'చంద‌మామ'‌... ఇప్పుడు ముచ్చ‌ట‌గా మూడోసారి సినీ గురువు తేజ ద‌ర్శ‌క‌త్వంలో 'సీత' అనే సినిమాలో న‌టించింది. ఈ చిత్రం ఈ నెల 24న విడుద‌ల కానుంది. 
 
ఈ సంద‌ర్భంగా ఆమె స్పందిస్తూ, "తొలిసారి నెర్వ‌స్‌గా అనిపిస్తుంది. నా మెంట‌ర్‌, గైడ్ అయిన తేజ‌గారు లేక‌పోతే నేను ఇక్క‌డ ఉండేదాన్ని కాను. ఆయ‌న స్కూల్లోనే న‌టిగా చాలా విష‌యాల‌ను నేర్చుకున్నాను. ఇప్పుడు 'సీత' సినిమా రూపంలో పి.హెచ్‌.డి చేసే అవ‌కాశం ద‌క్కింది" అన్నారు. మరీ ఇంతలా మునగ చెట్టు ఎక్కించేస్తోందంటే ఎప్పుడు తోసేస్తుందో మరి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు