గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా కోసం అందాల తార.. సీనియర్ నటీమణి శ్రేయా ప్రమోషన్‌లో భారీ ఎత్తున పాల్గొంటోంది. సీనియర్ హీరోయిన్లు శ్రియా, కాజల్ టాలీవుడ్ టాప్ హీరోలతో జతకట్టిన 'గౌతమీపుత్ర శాతకర్ణి', 'ఖైదీ నం.150' సినిమాలు ఈ సంక్రాంతికి విడుదలైన సంగతి తెలిసిందే. ఈ రెండు సినిమాలు విజయవంతమైనాయి. ఈ మధ్య సోలో హీరోయిన్‌గా హిట్ లేని శ్రియాకి 'శాతకర్ణి'లాంటి హిస్టారికల్ హిట్ పడడంతో ఈ అమ్మడు ఆనందంతో పండగ చేసుకుంటోంది.
ఆ మూవీ ప్రమోషన్‌లో బాలయ్య, క్రిష్‌తో కలిసి సందడి చేస్తోంది. అయితే ఈ విషయంలో కాజల్‌కి సీన్ రివర్స్ అయ్యింది. లాస్ట్ ఇయర్ రెండు భారీ డిజాస్టర్లు ఇచ్చిన కాజల్ ఈ ఇయర్ చిరంజీవి 'ఖైదీ'తో హిట్ కొట్టింది. 'లెట్స్ డూ కుమ్ముడు' అంటూ చిరు పక్కన కాజల్ అలరించింది. కానీ ప్రమోషన్‌లో ఏమాత్రం కనిపించట్లేదు. చిరంజీవి, చెర్రీ, అల్లు అరవింద్, నిహారిక ఇలా మెగా ఫ్యామిలీ మాత్రమే చేస్తోంది. కానీ కాజల్ తన మూవీ షూటింగ్‌తో బిజీగా వుండి.. ప్రమోషన్‌కి రావడం కుదరట్లేదని యూనిట్ చెప్తోంది.