తెలుగు వెండితెర వెనుక జరుగుతున్న లోగుట్టు వ్యవహారంపై పలువురు సెలెబ్రిటీలు అపుడపుడూ సంచలన కామెంట్స్ చేస్తున్నారు. ఈ విధంగా వ్యాఖ్యలు చేయడం ఇటీవలి కాలంలో ఎక్కువై పోయింది. ముఖ్యంగా పలువురు హీరోయిన్లే దర్శకనిర్మాతలు, హీరోలపై వివాదాస్పద కామెంట్స్ చేశారు. ఈ జాబితాలో సీనియర్ నటి కాజల్ అగర్వాల్ కూడా చేరారు.
"ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో నాకేం అర్థమయ్యేది కాదు. ఇలాంటి సన్నివేశాల్లో చేయొచ్చా? లేదా అనే అవగాహన ఉండేది కాదు. ఇష్టం లేకుండానే రాజీ పడి కొన్నిసార్లు నటించా. అయితే ఇప్పుడు మాత్రం రాజీ అనే మాటకు తావే లేదు. కొంతమంది కథానాయికలు ఇంకా ఆ బంధనాల్లోనే ఉన్నారు. వాళ్లంతా బయటకు రావాలి" అంటూ కాజల హితవు పలుకుతుంది.