ఈ సందర్భంగా నిర్మాత జి.హరి మాట్లాడుతూ... ''ఈ చిత్రానికి సంబంధించిన టోటల్ షూటింగ్ పూర్తయింది. అక్టోబర్ 21 సాయంత్రం 6 గంటలకు హీరోయిన్ కాజల్ చేతుల మీదుగా ఈ చిత్రం టీజర్‌ను విడుదల చేస్తున్నాం. విశాల్ కెరీర్‌లోనే 'ఒక్కడొచ్చాడు' డిఫరెంట్ మూవీ అవుతుంది. యాక్షన్ ఉంటూనే మంచి సందేశంతో రూపొందుతున్న కమర్షియల్ ఎంటర్‌టైనర్ చిత్రమిది. ఇందులోని పాటలు, యాక్షన్ సీక్వెన్స్‌లు, ఛేజ్‌లను చాలా రిచ్‌గా చిత్రీకరించడం జరిగింది.
సినిమాకి అవి చాలా పెద్ద హైలైట్ అవుతాయి. హిప్‌హాప్ తమిళ చాలా అద్భుతమైన సంగీతాన్ని అందించారు. నవంబర్ మొదటి వారంలో ఆడియోను రిలీజ్ చేసి, నవంబర్‌లోనే సినిమా కూడా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. 'ఒక్కడొచ్చాడు' విశాల్‌కి తెలుగులో మరో సూపర్‌హిట్ సినిమా అవుతుంది'' అన్నారు.
మాస్ హీరో విశాల్, తమన్నా జంటగా నటిస్తున్న ఈ భారీ చిత్రంలో ప్రైమ్‌స్టార్ జగపతిబాబు విలన్‌గా నటిస్తున్నారు. సంపత్‌రాజ్, చరణ్, జయప్రకాష్ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: హిప్‌హాప్ తమిళ, సినిమాటోగ్రఫీ: రిచర్డ్ ఎం.నాథన్, ఎడిటింగ్: ఆర్.కె.సెల్వ, డాన్స్: దినేష్, శోభి, సహనిర్మాత: ఇ.కె.ప్రకాష్, నిర్మాత: జి.హరి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సురాజ్.